ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి, పరిస్థితి విషమం!
Published Mon, Dec 30 2013 6:09 PM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
ఆస్ట్రేలియాలో దుండగులు జరిపిన దాడిలో భారతీయ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్టు మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. భారతీయ విద్యార్థి మన్ రియాజ్ విందర్ ని దోచుకోవడమే కాకుండా దారుణంగా చావబాదినట్టు ది ఏజ్ వెల్లడించింది. ఈ దుర్ఘటన మెల్ బోర్న్ లో చోటు చేసుకుంది. మార్ పార్క్ వద్ద తన స్నేహితుడితో మన్ రియాజ్ విందర్ ఉండగా ఏడుగురు ఆఫ్రికన్లు, ఓ మహిళ దాడికి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో వెల్లడైంది.
బాధితుడితో అగంతకుల గ్రూప్ గొడవ పడిన తర్వాత ముఖంపై కొట్టడంతో సింగ్ సృహతప్పి పడిపోయాడని పోలీసుల తెలిపారు. ఆతర్వాత గ్రూప్ లోని మిగితా అగంతకులు ఇష్టం వచ్చినట్టు కొట్టారని పోలీసులు తెలిపారు. ఆతర్వాత సింగ్ ను ఆల్ ఫ్రెడ్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
మెల్ బోర్న్ యూనివర్సిటీలో కామర్స్ డిగ్రిని చదువుతున్నట్టు బాధితుడి సోదరుడు యద్విందర్ సింగ్ తెలిపారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.. తన కుటుంబ సభ్యులకు ఈవార్తను ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. తన తల్లి హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడుతోంది అని యద్వీందర్ చెప్పారు.
Advertisement
Advertisement