Melbourne city
-
రామ్ చరణ్‌తో సెల్ఫీ.. మురిసిపోయిన మేయర్
మెగాహీరో రామ్ చరణ్.. రీసెంట్గా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వెళ్లాడు. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అక్కడి అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. అయితే చరణ్‌తో సెల్ఫీ దిగిన మెల్బోర్న్ మేయర్ తెగ మురిసిపోయాడు. తెగ ఆనందపడిపోతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడిది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీమేక్ సినిమా.. ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో)'మన నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడే ఉంటున్న భారతీయులు కీలకంగా ఉన్నారు. తాజాగా ఇక్కడ జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకలకు నేను వెళ్లాను. రామ్ చరణ్‌తో కలిసి సెల్ఫీ తీసుకున్నాను. నా కోరిక నెరవేరింది' అని చరణ్‌పై తన అభిమానాన్ని మేయర్ నిక్ రీస్ బయటపెట్టారు.ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్‌కు రామ్‌చరణ్ భార్యతో కలిసి హాజరయ్యాడు. ఆగస్టు 15న ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండా ఎగురవేశాడు. ఈ ప్రాంతం తనకెంతో ఇష్టమని, 'ఆరెంజ్' షూటింగ్ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. భారతీయ సినీ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీకి డబ్బులివ్వబోయిన అభిమాని) -
ఎన్నారై హత్యకేసు: సీక్రెట్ డైరీతో గుట్టురట్టు
మెల్బోర్న్ : మూడేళ్ల క్రితం మెల్బోర్న్లో హత్యకు గురైన సామ్ అబ్రహం కేసులో ఆస్ట్రేలియా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఆరెంజ్ జ్యూస్‌లో సైనేడ్ కలిపి సామ్‌ను హత్య చేసినందుకు అతడి భార్య, ఆమె ప్రియుడికి శిక్ష ఖరారు చేసింది. వివరాలు... కేరళకు చెందిన సామ్ అబ్రహం 2012లో ఉద్యోగ నిమిత్తం భార్య సోఫియా, కుమారుడితో సహా ఆస్ట్రేలియాకు వచ్చి స్థిరపడ్డాడు. అయితే అక్టోబర్ 13, 2015లో సామ్ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ విషయాన్ని కేరళలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపిన సోఫియా కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే మొదట గుండె నొప్పితోనే సామ్ మరణించాడని అందరూ భావించారు. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో విషప్రయోగం వల్లే అతడు మరణించాడని తేలింది. దీంతో స్థానిక పోలీసులు ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్నారు. సోఫియా ప్రవర్తనపై అనుమానంతో ఆమె కదలికలపై దృష్టి సారించారు. కొన్ని రోజుల తర్వాత సోఫియా, కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని వారు గమనించారు. ప్రాథమిక విచారణ అనంతరం సోఫియా, అరుణ్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. కీలకంగా మారిన సీక్రెట్ డైరీ... కేరళకు చెందిన అరుణ్ కమలాసనన్, సోఫియా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సోఫియా సామ్ అబ్రహంను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అరుణ్‌కు కూడా వేరొక అమ్మాయితో పెళ్లైంది. అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా సోఫియా, అరుణ్‌లు తమ గతాన్ని మర్చిపోలేకపోయారు. సోఫియా భర్తతో కలిసి మొదట దుబాయ్‌లో ఉండేది. తర్వాత 2012లో వాళ్లు ఆస్ట్రేలియాకు వచ్చి సెటిలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్ భార్యా పిల్లల్ని వదిలి పెట్టి 2013లో ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అప్పటి నుంచి సోఫియా, అరుణ్‌లు రహస్యంగా కలుసుకునేవారు. వారు చర్చించుకున్న విషయాల గురించి సోఫియా తన డైరీలో రాసుకునేది. ఈ విషయాలేవీ భర్తకు తెలియకుండా జాగ్రత్తపడేది. ఈ క్రమంలో సామ్ అడ్డు తొలగించుకుంటే జీవితాంతం తామిద్దరం కలిసి ఉండొచ్చని భావించిన అరుణ్.. సోఫియాను ఒప్పించి సామ్‌ను హత్య చేసేందుకు పథకం రచించాడు. అందులో భాగంగానే 2015 అక్టోబర్‌లో సామ్‌కు సైనేడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి అతడిని హత్య చేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సోఫియా జాగ్రత్తపడింది. కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు హత్య కేసును సునాయాసంగా ఛేదించారు. ఇదే సరైన శిక్ష... ‘సామ్ అబ్రహం కుటుంబంతో సహా తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. అతడిని చంపడానికి నిందితులు విషాన్ని(సైనేడ్) ఉపయోగించారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ హత్యలో ప్రధాన సూత్రధారి అయిన అరుణ్ కమలాసనన్‌కు 27 ఏళ్లు, అతడికి సహకరించిన సోఫియాకు 22 ఏళ్ల పాటు కఠిన శిక్ష విధిస్తున్నానంటూ’ జస్టిస్ కోగ్లాన్ తీర్పు వెలువరించారు. నిందితులకు ఇదే సరైన శిక్ష అంటూ వ్యాఖ్యానించారు. సోఫియాను నిందితురాలిగా నిరూపించడానికి ఆమె సీక్రెట్ డైరీ ఉపయోగపడిందని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా దీపావళి వేడుకలు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ఫెడరల్ రెవిన్యూ మంత్రి కెల్లీ ఓడ్విన్ అధ్యక్షతన లిబరల్ పార్టీ నాయకులు ముత్యాల రాంపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియాలోని వివిధ భారతీయ సంఘాల నాయకులతో జరిపిన ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ ఎన్ఆర్ఐ మహేష్ బిగాల, టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో కూడా విస్తరిస్తూ, మన పండగలను ప్రతీ సంవత్సరం అట్టహాసంగా జరుపుతున్న లిబరల్ పార్టీ నాయకుడు ముత్యాల రాంపాల్ రెడ్డికి నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులకు ఎంతో ముఖ్యమైన దీపావళి వేడుకలను లిబరల్ పార్టీ తరపున నిర్వహిస్తున్నందుకు రెవిన్యూ మినిస్టర్‌కి మహేష్ బిగాల అభినందనలు తెలిపారు. అలాగే ఈ వేడుకలలో ఇండియన్ కాన్సుల్ జనరల్ మణిక జైన్, టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు జమాల్ మొహమ్మద్ తో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి, పరిస్థితి విషమం!
ఆస్ట్రేలియాలో దుండగులు జరిపిన దాడిలో భారతీయ విద్యార్థి తీవ్రంగా గాయపడినట్టు మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. భారతీయ విద్యార్థి మన్ రియాజ్ విందర్ ని దోచుకోవడమే కాకుండా దారుణంగా చావబాదినట్టు ది ఏజ్ వెల్లడించింది. ఈ దుర్ఘటన మెల్ బోర్న్ లో చోటు చేసుకుంది. మార్ పార్క్ వద్ద తన స్నేహితుడితో మన్ రియాజ్ విందర్ ఉండగా ఏడుగురు ఆఫ్రికన్లు, ఓ మహిళ దాడికి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. బాధితుడితో అగంతకుల గ్రూప్ గొడవ పడిన తర్వాత ముఖంపై కొట్టడంతో సింగ్ సృహతప్పి పడిపోయాడని పోలీసుల తెలిపారు. ఆతర్వాత గ్రూప్ లోని మిగితా అగంతకులు ఇష్టం వచ్చినట్టు కొట్టారని పోలీసులు తెలిపారు. ఆతర్వాత సింగ్ ను ఆల్ ఫ్రెడ్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మెల్ బోర్న్ యూనివర్సిటీలో కామర్స్ డిగ్రిని చదువుతున్నట్టు బాధితుడి సోదరుడు యద్విందర్ సింగ్ తెలిపారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.. తన కుటుంబ సభ్యులకు ఈవార్తను ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. తన తల్లి హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడుతోంది అని యద్వీందర్ చెప్పారు.