ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికా విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది గరిష్ట స్థాయిలో నమోదైంది. ఇది ఆల్‌టైమ్ రికార్డని అమెరికా ప్రక టించింది. ఈ ఏడాది చేరిన 10,95,299 మంది విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌లదే అగ్రస్థానం. మొత్తం విద్యార్థుల్లో ఈ రెండు దేశాలకు చెందిన వారే 52.18 శాతం మేర ఉన్నారు. తరువాత స్థానాల్లో దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కె నడా ఉన్నాయి. మొత్తం 10,95,299 మంది అంతర్జాతీయ విద్యార్థులు 2019 లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరారు.
వారిలో 5,71,562 మంది చైనా, భారత్ విద్యార్థులు. ఆ తరువాత అధిక సంఖ్యలో విద్యార్థులు కలిగి ఉన్న దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, కెనడా వి ద్యార్థులను కూడా కలుపుకుంటే టాప్ 5 దేశాలకు చెందిన విద్యార్థులు 62.72 శాతం మంది అయ్యారు. మిగిలిన దేశాలకు చెందిన విద్యార్థులు 4,08,285 మంది ఉండగా మొత్తం విద్యార్థుల్లో వా రిది 37.26 శాతం. యూరప్ దేశాల నుంచి గరిష్టంగా 1.5 శాతం మంది, కనిష్టంగా 0.75 శాతం మంది విద్యార్థులుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తా న్, మలేసియా, హాంకాంగ్ నుంచి 1.5 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థులు సైతం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment