డల్లాస్: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఓ భారత విద్యార్థి అక్కడ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల లింటో ఫిలిప్ నాలుగు నెలల కిందట మాస్టర్స్ కోసం డల్లాస్ వెళ్లాడు. ప్రస్తుతం అతని తల్లిదండ్రులు సుసాన్ ఫిలిప్, పీఎం ఫిలిప్ దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో మాస్టర్స్ చేస్తున్న లింటో శనివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి సాహసోపేతమైన కయాకింగ్ ట్రిప్‌కు వెళ్లాడు. కయాకింగ్ అనేది నీటిలో ఒక చిన్న పడవపై చేసే ప్రయాణం.
లేక్ రే హుబ్బార్డ్‌లో లింటో కయాకింగ్ చేస్తుండగా.. జలల ప్రవాహం అధికంగా ఉండటంతో అతని కయాక్ తిరగబడిందని డల్లాస్ పోలీసులు తెలిపారు. దీంతో లింటో నీళ్లలో కొట్టుకుపోయాడని వెల్లడించారు. గల్లంతయిన అతడి మృతదేహాన్ని గుర్తించిన రెస్యూ సిబ్బంది పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment