
బెంగళూరు: ఉక్రెయిన్‌లో మృతిచెందిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ(22) మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నవీన్ పార్థివదేహాన్ని తీసుకొచ్చేందుకు విమానంలో ఉపయోగించే స్థలంలో 10 నుంచి 12 మందిని కూర్చోబెట్టవచ్చని అన్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో బతికి ఉన్నవాళ్లను తీసుకురావడమే చాలా కష్టంగా మారగా మృతదేహాలను సొంత దేశాలకు తరలించడం మరింత కష్టమన్నారు. అయినప్పటికీ నవీన్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని వివరించారు.