న్యూఢిల్లీ: పోలండ్‌లోని పోజ్నన్‌లోని ఓ ట్రామ్ వాహనంలో దుండగుడు భారతీయ విద్యార్థిపై బుధవారం దాడి చేశాడు. అతనికి ప్రాణాపాయం తప్పింది. ఓ భారతీయ విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో మరణించాడని అక్కడి మీడియాలో ఓ వార్త ప్రసారమైంది. దీనిని ఓ వ్యక్తి విదేశాంగ మంత్రి సుష్మ దృష్టికి తీసుకురావడంతో ఆమె స్పందించారు. నివేదిక ఇవ్వాల్సిందిగా పోలండ్‌లో భారత రాయబారిని ఆదేశించారు.
అమెరికాలో సిక్కు డాక్టర్‌కు బెదిరింపులు: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని మోన్రో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిక్కు డాక్టర్ అమన్‌దీప్ సింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. గతంలోనూ వివిధ మతాలకు చెందిన వారిని చాలా మందిని చంపినట్లుగా ఆగంతకుడు సందేశంలో పేర్కొన్నాడు. ‘14 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇలాంటి బెదిరింపులకు భయపడి సమాజసేవను ఆపను’ అని తెలిపారు.
పోలండ్‌లో భారతీయ విద్యార్థిపై దాడి
Published Sat, Apr 1 2017 3:40 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement