అమెరికాలో భారతీయుల విద్యార్ధుల మరణాలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్ సైనీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఓ దుండగుడు సైనీ తలపై 50 సార్లు సుత్తితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్ధి అమెరికాలో ప్రాణాలు విడిచాడు. ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు.
జాన్ మార్టిన్సన్ హానర్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్‌లో మాస్టర్స్‌చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్‌లోని మారిస్ జే జుకక్రో లాబొరేటరీస్ సమీపంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు.
పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ కూడా నీల్ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు 10 రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు అమెరికాలో ప్రాణాలు విడవడం కలకలం రేపుతోంది.
Our son Neel Acharya is missing since yesterday Jan 28( 12:30 AM EST) He is studying in Purdue University in the US.
— Goury Acharya (@AcharyaGoury) January 29, 2024
He was last seen by the Uber driver who dropped him off in Purdue university.
We are looking for any info on him. Please help us if you know anything. pic.twitter.com/VWIS5uyJde
తల్లి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే..
తన కొడుకు ఆచూకీ కనుక్కోవాలని ఆదివారం నీల్ తల్లి గౌరీ ఆచార్య ఇన్‌స్టాగగ్రామ్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తమ కొడుకు జనవరి 28 నుంచి కనిపించడం లేదని, అతను యూఎస్‌లోని పర్డ్యూ యూనివర్సిటీలో చదవుతున్నట్లు తెలిపారు. తమ కుమారుడికి సంబంధించిన సమాచారం తెలిస్తే చెప్పాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమయ్యారు. తాము పర్డ్యూ విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అనంతరం నీల్ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment