పాకిస్తాన్ పౌరుడు అసిఫ్
మర్చెంట్‌ను అరెస్టు చేసిన ఎఫ్‌బీఐ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థ డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు అడ్డుకున్నారు. ట్రంప్‌తోపాటు మరికొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను అంతం చేయడానికి స్కెచ్ వేసిన పాకిస్తాన్ పౌరుడు అసిఫ్ మర్చెంట్(46)ను జూలై 12న అరెస్ట్ చేశారు.
అతడిపై హత్య కేసు నమోదుచేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసిఫ్ మర్చెంట్‌కు ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అధికారులు సమరి్పంచిన పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది.
జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌తో అసిఫ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు స్పష్టంచేశారు. ట్రంప్‌తోపాటు ఇతర పెద్దలను హత్య చేయడానికి అసిఫ్ నియమించుకున్న కిరాయి హంతకుడే అధికారులకు ఉప్పందించి, అతడిని చట్టానికి పట్టివ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment