Asif
-
USA Presidential Elections 2024: ట్రంప్ హత్యకు కుట్ర!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థ డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి జరిగిన కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు అడ్డుకున్నారు. ట్రంప్‌తోపాటు మరికొందరు రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను అంతం చేయడానికి స్కెచ్ వేసిన పాకిస్తాన్ పౌరుడు అసిఫ్ మర్చెంట్(46)ను జూలై 12న అరెస్ట్ చేశారు. అతడిపై హత్య కేసు నమోదుచేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసిఫ్ మర్చెంట్‌కు ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో అధికారులు సమరి్పంచిన పత్రాలతో ఈ విషయం వెలుగులోకి వచి్చంది. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై తుపాకీతో కాల్పులు జరిపిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌తో అసిఫ్కు ఎలాంటి సంబంధం లేదని ఎఫ్‌బీఐ అధికారులు స్పష్టంచేశారు. ట్రంప్‌తోపాటు ఇతర పెద్దలను హత్య చేయడానికి అసిఫ్ నియమించుకున్న కిరాయి హంతకుడే అధికారులకు ఉప్పందించి, అతడిని చట్టానికి పట్టివ్వడం గమనార్హం. -
కంటైనర్ ఢీకొని తల్లీ, కొడుకు మృతి
ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జాతీయ రహదారి నెత్తురోడింది. జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్ మండలం బట్టుపెల్లికి చెందిన తల్లి, కొడుకు సహెరాభాను(35), షేక్ ఆసిఫ్(16) దుర్మరణం చెందారు. తండ్రి సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. సర్వర్ తన భార్య, కుమారుడితో కలసి శనివారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం మోటార్‌సైకిల్‌పై తిరిగి బట్టుపెల్లికి బయల్దేరారు. జాతీయ రహదారి ఎగ్జిట్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఓ కంటైనర్ లారీ.. సర్వర్ మోటార్‌సైకిల్‌పై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కంటైనర్ వెనక టైర్ కిందికి వచ్చిన తల్లి, కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. సర్వర్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, బైక్‌పై నుంచి దూసుకెళ్లిన కంటెయినర్ లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని కూడా ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేషనల్ హైవేకు చెందిన 1033 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సైలు మహేందర్, ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఎగ్జిట్ దారి మూసి వేయాలని ధర్నా.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట చెక్‌పోస్టు మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గాన్ని మూసి వేయాలని స్థానికులు ప్రమాదస్థలం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని గుండి రహదారి.. ఆపై సర్విస్ రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి వాహనాలు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
బరితెగించిన టీడీపీ నేతలు.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై దాడి..!
-
లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామస్టేజీ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ ఓ లారీని వెనకనుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామానికి చెందిన మేడి హరీశ్ (22), హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉండే ఎం.డి.ఆసిఫ్ (22), ఎం.డి.సల్మాన్ (23)లు రామంతపూర్‌లోనే ఓ కంపెనీలో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హరీశ్, ఆసిఫ్‌లు సంస్థకు చెందిన హాస్టల్లోనే ఉంటుండగా సల్మాన్ మాత్రం తల్లిదండ్రులతో కలసి స్థానికంగా ఉంటున్నాడు. ఈ ముగ్గురు శుక్రవారం సాయంత్రం పిట్టంపల్లి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు అందరితో కలసి ఆనందంగా గడిపారు. భోజనం చేశాక ఒంటిగంట సమయంలో ముగ్గురు కలసి హైదరాబాద్‌కు పల్సర్ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ధర్మోజిగూడెం స్టేజీ వద్ద, వే బ్రిడ్జి నుంచి గ్రానైట్ లోడ్ లారీని డ్రైవర్ రివర్స్ తీస్తూ అకస్మాత్తుగా హైవేపైకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో బైక్ నడుపుతున్న సల్మాన్, లారీ అకస్మాత్తుగా రావడంతో వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. -
నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు
-
నయీమ్ అనుచరుడు ఆసిఫ్ అరెస్టు
కోరుట్ల కోర్టులో హాజరు.. 14 రోజుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్/కోరుట్ల/భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు మహ్మద్ ఆసిఫ్‌ఖాన్(45)ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ పారిపోయే యత్నాల్లో ఉన్న ఆసిఫ్‌ను పుణె ఎయిర్‌పోర్టులో గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోరుట్ల వ్యాపారి రవూఫ్‌ను కిడ్నాప్ చేసి రూ.30 లక్షలు వసూలు చేసిన కేసులో ఆసిఫ్‌ను శుక్రవారం కోరుట్ల కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఆసిఫ్‌కు 15 ఏళ్లుగా నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. నయీమ్‌కు అత్యంత సన్నిహితునిగా ఉండి అతనికి సంబంధించిన కీలక వ్యవహారాలు ఆసిఫ్ చక్కబెట్టేవాడని సమాచారం. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు మకాం మార్చిన ఆసిఫ్.. నయీమ్‌కు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా గుర్తింపు ఉంది. డబ్బుల రికవరీ వంటి కీలక వ్యవహారాలను చూసుకుంటాడని తెలిసింది. భువనగిరి పరిసరాల్లో నయీమ్ నిర్వహించిన అనేక భూ సెటిల్మెంట్లలో ఆసిఫ్ కీలకంగా వ్యవహరించి వ్యూహాత్మకంగా డబ్బులు గుంజేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆయుధాల సరఫరాలో.. నయీమ్ గ్యాంగ్‌కు ఆయుధాలు సరఫరా చేయడంలోనూ ఆసిఫ్ పాత్ర ఉందన్న సందేహాలున్నాయి. ఆగస్టు 8న నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం వనస్థలిపురంలో సిట్ పోలీసులు నిర్వహించిన దాడిలో ఓ ఇంటి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను అక్కడికి తరలించడంలో ఆసిఫ్ పాత్ర ప్రధానమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నయీమ్ గ్యాంగ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ఆయుధాలు తీసుకువచ్చి అప్పగించే పనిలోనూ ఆసిఫ్ ముఖ్యభూమిక పోషించాడన్న అనుమానాలున్నాయి. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఆసిఫ్.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో సిట్ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్టుల్లో అతడిపై లుక్అవుట్ ప్రకటించారు. మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం.. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీను వెల్లడించిన విషయాలతో మరికొందరి అరెస్టులకు సిట్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌కు ముందు పీడీ యాక్ట్ నమోదుతో వరంగల్ జైలులో ఉన్న పాశం శ్రీనును ఆగస్టు 31న సిట్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. శనివారంతో కోర్టు ఇచ్చిన గడువు ముగియనుండగా.. పాశం శ్రీను నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. నయీమ్ గ్యాంగ్ కిడ్నాప్‌లు, బెదిరింపులతో భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో పాల్గొన్న నిందితులు, బాధితుల వివరాలను శ్రీను పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అక్రమ దందాల్లో తనతోపాటు పాల్గొన్న వారి పేర్లను శ్రీను బహిర్గతం చేయడంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత సమాచారం రాబట్టేందుకు శ్రీను కస్టడీని పొడిగించేలా కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ‘పోలీస్ పేజీ’పై సిట్ ఆరా..! గ్యాంగ్‌స్టర్ నయీమ్ ద్వారా లబ్ధి పొందిన వారిని గుర్తించే పనిలో సిట్ నిమగ్నమైంది. ప్రత్యేకించి నయీమ్ వల్ల లాభపడిన పోలీసులపై దృష్టి సారించింది. నయీమ్ డైరీలో ‘పోలీస్ పేజీ’లో వెలుగు చూసిన పేర్లతో పాటు చివరి దాకా అతనితో టచ్‌లో ఉన్న పోలీసులను విచారించాలని యోచిస్తోంది. గ్యాంగ్‌స్టర్ అండ చూసుకుని కోట్లకు పడగలెత్తిన పోలీసు అధికారుల చిట్టా రూపొందిస్తోంది. ఇప్పటికే కొంత మందిని గుర్తించిన సిట్ అధికారులు.. ఒకట్రెండు రోజుల్లో వారిని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. నయీమ్ ఇచ్చిన సమాచారంతో అనేక మంది అగ్రశ్రేణి మావోయిస్టులను ఎన్కౌంటర్లలో మట్టుబెట్టిన కొందరు పోలీసు అధికారులు రివార్డులు, ప్రమోషన్లతో లబ్ధి పొందారు. సిట్ విచారణ చేపట్టాలని భావిస్తుండటంతో తమ బండారం బయటపడుతుందని కొందరు అధికారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. 62 కేసులు నమోదు సిట్ చీఫ్ నాగిరెడ్డి గ్యాంగ్‌స్టర్ నయీమ్‌పై ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు నమోదైనట్లు సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే 53 మందిని అరెస్టు చేయగా.. శుక్రవారం ఒక్క రోజే పది మందిని అరెస్టు చేశారు. వీరిని కోరుట్ల, భువనగిరి పోలీస్స్టేషన్లకు తరలించారు. నయీమ్ ప్రధాన అనుచరుడు పాశం శ్రీనుకు వీరంతా సన్నిహితులని సిట్ పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో ఆసిఫ్‌ఖాన్, చిన్నబత్తిని బెంజమిన్, కాసాని ఇంద్రసేనా, గుమ్మడెల్లి మల్లేశ్, కనుకుంట్ల శ్రీకాంత్, రావుల సురేశ్, గడ్డం జంగయ్య, రాకాల శ్రీనివాస్, సందెల ప్రవీణ్‌కుమార్, మహ్మద్ యూనస్‌లను అరెస్టు చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్‌లు, ఆయుధాలతో బెదిరించి బలవంతపు వసూళ్లు, భూ రిజిస్ట్రేషన్లు తదితర నేరాలకు సంబంధించి వీరిపై ఏడు కేసులు నమోదయ్యాయి. -
కప్పు పై నుంచి పడి యువకుడి మృతి
పైకప్పు నిర్మాణ పనులు చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు అక్కడినుంచి జారిపడి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేగుంటలోని జీవిక పరిశ్రమలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంటలోని జీవిక పరిశ్రమలో పైకప్పు నిర్మాణ పనుల్లో ఉన్న ఆసీఫ్(20) ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడ్డాడు. గాయపడిన ఆసీఫ్‌ను ఆస్పత్రికి తరళిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడు ఉత్తర్‌ప్రదేశ్ వాసిగా గుర్తించి బంధువులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత ్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
సల్మాన్ భట్, ఆసిఫ్ పునరాగమనం
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్ మొహమ్మద్ ఆసిఫ్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి సత్తా చాటుకున్నారు. ఇటీవలే వీరి సస్పెన్షన్ కాలం ముగియడంతో పాక్ జాతీయ వన్డే కాంపిటీషన్లో పాల్గొన్నారు. ఆదివారం డబ్ల్యుఏపీడీఏ జట్టు తరఫున బరిలోకి దిగిన భట్ సెంచరీ (143 బంతుల్లో 135; 14 ఫోర్లు)తో అదరగొట్టగా ఇదే జట్టుకు ఆడుతున్న ఆసిఫ్ బౌలింగ్‌లో ఆరు ఓవర్లలో 23 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. 2010 ఇంగ్లండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన భట్, ఆసిఫ్, ఆమిర్ త్రయం స్వల్పకాలం జైలు కెళ్లడంతో పాటు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్‌లో వీరిపై నిషేధం ముగిసినా పునరావాస శిబిరంలో చేరారు. -
అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
న్యూఢిల్లీ: అల్ ఖైదా అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ (41)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ ప్రాంతం. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కట్రపన్నినట్టు నిఘా విభాగం హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలో ఆసిఫ్‌తో పాటు మరో అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. -
ఆసిఫ్‌ది హత్యే
నిర్ధారించిన పోలీసులు తోటి బాలుడే నిందితుడు సిటీబ్యూరో: సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర గృహం (జువెనైల్ హోమ్)లో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాలుడు ఆసిఫ్ (12)ది హత్యగా పోలీసుల విచారణలో తేలింది. తాను లైంగికదాడికి యత్నించిన విషయాన్ని జువైనల్ హోం అధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆసిఫ్ బెదిరించడంతో గొంతు పిసికి చంపేశానని అదే హోమ్‌లో ఉంటున్న హరీష్ (16..పేరు మార్చబడింది) వెల్లడించాడు. వివరాలు... సైదాబాద్‌లోని ప్రభుత్వ బాలుర గృహం (జువెనైల్ హోమ్)లో ఆసిఫ్ 2013 ఆగస్టు నుంచి ఉంటున్నాడు. కాగా, మంగళవారం రాత్రి హోంలోని మెడికల్ వార్డులో ఆసిఫ్, హరీష్‌లతో పాటు మరో ఏడుగురు పడుకున్నారు. అర్ధరాత్రి ఆసిఫ్‌ను హరీష్ నిద్రలేపి లైంగికదాడికి యత్నించాడు. ఆసిఫ్ ప్రతిఘటించడంతో పాటు విషయాన్ని హోం అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. దీంతో తన బండారం బయట పడుతుందని భావించిన హరీష్.. నీళ్లు తాగుదామని ఆసిఫ్‌ను వంట గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ దాడి చేసి గొంతుపిసికి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. వీలు కాలేక పోవడంతో శవాన్ని లాక్కొచ్చి అతని బెడ్‌పై పడేశాడు. బుధవారం ఉదయం ఆసిఫ్ నిద్రలేవకపోవడంతో సూపర్వైజర్లు శివశంకర్‌రెడ్డి, నరేందర్ అతడిని లేపేందుకు యత్నించారు. చలనం లేకపోవడంతో చనిపోయాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో హరీష్ తన నేరాన్ని అంగీకరించాడు. బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు గురువారం ఉదయం హోంను సందర్శించి అక్కడి పిల్లల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడు హరీష్‌ను శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ఆసిఫ్ మృతదేహానికి పోలీసులు ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి తండ్రికి అప్పగించారు. ఇద్దరు సూపర్వైజర్ల సస్పెన్షన్... హోమ్ సూపర్వైజర్లు శివశంకర్‌రెడ్డి, జి.నరేందర్‌లు విధులపై నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ దారుణం జరిగిందని విచారణలో తేలడంతో అధికారులు వారిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
వామ్మో.. స్వైన్‌ఫ్లూ
మొయినాబాద్: స్వైన్‌ఫ్లూ సోకి చికిత్స పొందుతున్న రైతు మృత్యువాత పడడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మొయినాబాద్‌కు చెందిన రైతు ఆసిఫ్(29) మృతితో మొయినాబాద్ మండల కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. ఈనెల 6న ఆసిఫ్‌కు జ్వరం రావడంతో కుటుంబీకులు నగరంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించి చికిత్స అందించసాగారు. పరిస్థితి విషమించడంతో రైతు శుక్రవారం రాత్రి చనిపోయాడు. ఆసిఫ్‌కు స్వైన్‌ఫ్లూ సోకిందనే విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు వారం రోజుల క్రితం ఇళ్లు వదిలివెళ్లారు. మొయినాబాద్‌లోని ప్రభు త్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు పట్టుబట్టారు. కొందరు తల్లిదండ్రులు శనివారం తమ పిల్లలను స్కూళ్లు, కాలేజీలకు పంపలేదు. విద్యార్థులు మాస్క్‌లు ధరించి స్కూళ్లకు వెళ్తున్నారు. పెద్దలు కూడా మాస్క్‌లతో బయటకు వెళ్తున్నారు. శనివారం నలుగురు ఓ చోట కలిస్తే ‘స్వైన్‌ఫ్లూ’ విషయమే మాట్లాడుతూ కనిపించారు. మూడు రోజుల క్రితం.. మూడు రోజుల క్రితం మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(30) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆయన పచ్చకామెర్ల వ్యాధితో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్‌కు పది రోజల క్రితం జ్వరం రావడంతో కుటుంబీకులు నగరంలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు గురువారం మృతి చెందాడు. అతడి అంత్యక్రియలు స్వస్థలం రాజేంద్రనగర్ మండలంలోని నార్సింగిలో నిర్వహించారు. ఇమ్రాన్ భార్య నూర్జహాన్(25) సైతం అనారోగ్యంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. కాగా దంపతులకు స్వైన్‌ఫ్లూ సోకి ఉండొచ్చని మొయినాబాద్‌లో పుకార్లు వ్యాపించాయి. ఆసిఫ్ పొరుగింట్లో ఉండే వృద్ధురాలు లక్ష్మి(65)కి ఇటీవల జ్వరంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికి తెలియలేదు. ఆమెకు కూడా స్వైన్‌ఫ్లూ సోకి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కాగా ఆసిఫ్ వ్యవసాయంతో పాటు పలు సంతలు తిరుగుతూ పశువుల క్రయవిక్రయాలు జరుపుతుండేవాడు. ఈక్రమంలో ఆయనకు స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి ఉంటుందని స్థాని కులు అనుమానిస్తున్నారు. భయంభయం.. శనివారం ఆసిఫ్ అంత్యక్రియలు మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానికంగా ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించొద్దని కొందరు స్థానికులు తహసీల్దార్ గంగాధర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. గృహ సముదాయాల మధ్య ఉన్న శ్మశానవాటికలో ఆసిఫ్ మృతదేహాన్ని ఖననం చేయడంతో ఇరుగుపొరుగు ఇళ్ల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమకు కూడా వ్యాధి వ్యాపిస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక.. కొందరు తమ ఇళ్లను ఖాళీ చేసి బంధువుల వద్దకు వెళ్తున్నారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతుండడంతో అవగాహన కల్పించాల్సిన అధికారులు పత్తా లేకుండా పోయారు. ఆసిఫ్‌కు స్వైన్ ఫ్లూ సోకిందనే విషయాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న చేవెళ్ల ఏరియా వైద్యాధికారి చెంచయ్య ఈనెల 13న మొయినాబాద్‌ను సందర్శించారు. ఆసిఫ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి నివారణ మాత్రలు అందజేశారు. వైద్యాధికారులు ఎటువంటి చర్యలు చే పట్టలే దు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందిం చాల్సి ఉంది. -
ఫిక్సింగ్ వనంలో...మిస్టర్ ‘క్లీన్’
క్రికెట్లో ఫిక్సింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పాకిస్థాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ నుంచి స్పాట్‌ఫిక్సింగ్ దాకా అన్ని రకాల అక్రమాల్లోనూ పాక్ క్రికెటర్లే అగ్రగణ్యులు. ఫిక్సింగ్‌కు పాల్పడి జరిమానాలకు గురైన వారు, నిషేధం ఎదుర్కొన్న వారు, చివరికి జైలు శిక్షలు కూడా అనుభవించిన వారు ఆ దేశ క్రికెటర్లలో ఉన్నారు. సలీం మాలిక్‌ను మొదలుకొని నిన్న మొన్నటి మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్, ఆసిఫ్‌ల దాకా పాక్ క్రికెటర్ల వ్యవహారం తెలిసిన విషయమే. ఆ స్థాయిలో మలినమైన పాకిస్థాన్ క్రికెట్లో... గంజాయి వనంలో తులసి మొక్కలా నిలిచాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. 1992-2003 మధ్య కాలంలో పాక్ జట్టు తరపున 37 టెస్టులు, 166 వన్డేలు ఆడిన లతీఫ్.. 6 టెస్టులు, 25 వన్డేల్లో జట్టుకు సారథ్యం కూడా వహించాడు. అయితే తాను ఆడుతున్న రోజుల్లోనే క్రికెటర్ల ‘లాలూచీ’లను పసిగట్టిన లతీఫ్ ఆనాడే వాటి గురించి వ్యాఖ్యానించాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక పాక్ క్రికెటర్ల ఫిక్సింగ్ వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చీఫ్ ప్యాట్రన్‌గా ఆ దేశాధ్యక్షుడు జర్దారీ ప్రకటించుకోవడాన్ని లతీఫ్ తప్పుబట్టాడు. ఈ విషయంపై కోర్టునూ ఆశ్రయించాడు. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన మాజీ లెగ్‌స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్‌ను జాతీయ క్రికెట్ అకాడమీలో పదవికి ఎంపిక చేయడంపైనా కోర్టుకెళ్లాడు. ఆటగాళ్ల ఫిక్సింగ్ వ్యవహారంపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశాడు. లతీఫ్ వ్యవహారశైలిపై పీసీబీకి ఆగ్రహం కలిగినా.. అతని ఆరోపణల్లో నిజముండడంతో కిమ్మనలేకపోయింది. సొంతంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసి యువ క్రికెటర్లకు శిక్షణనిస్తూ పీసీబీ నుంచి ఎటువంటి పదవులూ ఆశించకుండా నిజాయితీగా నిలబడ్డాడు. లతీఫ్లోని నిజాయితీని గమనించిన పీసీబీ.. చివరికి అతనికి వర్ధమాన క్రికెటర్లు ఫిక్సింగ్ వంటి అడ్డదారులు తొక్కకుండా చైతన్య పరిచే బాధ్యతను అప్పగించింది. తన పని తాను చేస్తూనే అక్రమాలపై ఎలుగెత్తడం మాత్రం లతీఫ్ మానలేదు. దీంతో కొద్ది కాలానికే తన పదవిని కోల్పోవాల్సివచ్చింది. మళ్లీ తాజాగా లతీఫ్‌కు జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి చేపట్టాల్సిందిగా ఆహ్వానం అందింది. అయితే దీనిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఫిక్సింగ్‌కు ఆరోపణలున్నవారు, అవినీతిలో కూరుకుపోయినవారు పీసీబీలో, సెలక్షన్ కమిటీలో ఉన్నారని, అటువంటి వారితో కలిసి తాను పనిచేయబోనని లతీఫ్ కుండబద్దలు కొట్టారు. నిత్యం వివాదాల్లో ఉండే పాకిస్థాన్ క్రికెట్లో మచ్చలేని వ్యక్తిగా నిలిచిన లతీఫ్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.