హూస్టన్: మెదడుపై కీలక పరిశోధన చేస్తున్న భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీల్ రెజాక్‌కు ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్‌ఎఫ్‌సీ)’ భారీ మొత్తంలో రూ 5.40 కోట్ల(8.66 డాలర్లు) గ్రాంటును ప్రకటించింది. రోజువారీ జీవితంలో శబ్దాలను మెదడు ఎలా విశ్లేషిస్తుంది? అన్న కోణంలో తదుపరి పరిశోధన నిర్వహించేందుకుగాను ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ కింద ఖలీల్‌కు ఈ మొత్తం గ్రాంటు లభించింది.
ఈ నిధులను దశలవారీగా ఐదేళ్లలో ఎన్‌ఎఫ్‌సీ అందించనుంది. ఖలీల్ పరిశోధనలు ఓ కొలిక్కి వస్తే గనక... వయసు రీత్యా వచ్చే వినికిడి సమస్యలకు కొత్త చికిత్సలు కనుగొనేందుకు మార్గం సుగమం కానుంది.