NFC
-
ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ).. టెక్నికల్ ఆఫీసర్–డి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్. ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. ► వయసు: 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.67,000 చెల్లిస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 21.08.2021 ► వెబ్సైట్: www.nfc.gov.in -
ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(ఎన్ఎఫ్సీ).. వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► ట్రేడులు: అటెండెంట్, ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, కోపా, స్టెనోగ్రాఫర్, మెకానిక్ డీజిల్, ప్లంబర్, వెల్డర్. ► అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 2018, 2019, 2020లో విద్యార్హత పూర్తి చేసుకున్న వారు మాత్రమే అర్హులు. ► వేతనం: వివిధ ట్రేడుల ఆధారంగా నెలకు రూ.8,050, నెలకు రూ.7,700 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021 ► వెబ్సైట్: https://apprenticeshipindia.org మరిన్ని నోటిఫికేషన్లు: వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు డీఎస్ఎస్ఎస్బీలో 5807 టీజీటీ పోస్టులు డీఆర్డీవో, హైదరాబాద్‌లో 10 జేఆర్ఎఫ్ ఖాళీలు -
మరో మైలురాయి దాటిన ఎన్ఎఫ్సీ
కుషాయిగూడ: అణు విద్యుత్ ఉత్పత్తిలో నిరంతరాయంగ సేవలందింస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంఫ్లెక్స్ (ఎన్ఎఫ్సీ) మరో మైలురాయిని దాటింది. సంస్థ తయారు చేసే పవర్ బండిల్స్ ఉత్పత్తి మిలియన్ (10లక్షలు)లకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం ఎన్ఎఫ్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా çహా జరైన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ యస్కే శర్మకు ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ శ్రీవాస్తవ పవర్ బండిల్స్‌ను అందజేశారు. అందుబాటులో అన్ని ఎఫర్ట్స్‌ను ఉపయోగిం చి సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి తోడ్పాటునందిస్తున్న ఎన్ఎఫ్సీ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. -
ఇక స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా ఒకే రకమైన డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా అన్నీ ఒకే పరిమాణం, రంగు, రూపురేఖలు, భద్రతా సౌకర్యాలతో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది జూలై నుంచి ఈ రకమైన కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు దేశంలోని అన్ని రోడ్డు రవాణా కార్యాలయాల్లోనూ జారీ అవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారితోపాటు పాత వాటిని రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ కొత్త ఫార్మాట్లోనే లైసెన్స్‌లను జారీ చేయనున్నారు. ఈ లైసెన్స్‌లపై జాతీయ, సబంధిత రాష్ట్ర చిహ్నాలు ఉంటాయి. భద్రత కోసం కార్డుల్లో మైక్రో చిప్‌లను అమర్చి, క్యూఆర్ కోడ్లను కూడా ముద్రించనున్నారు. లైసెన్స్‌దారుడి సమాచారాన్ని సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ప్రస్తుతం మెట్రోరైళ్ల స్మార్ట్‌కార్డుల్లో వాడుతున్న ఎన్ఎఫ్సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) టెక్నాలజీని కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్సుల్లో వాడొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ఫార్మాట్లలో డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. -
ఎన్ఎఫ్సీ ఛైర్మన్‌గా కళ్యాణ క్రిష్ణన్
హైదరాబాద్: అణు ఇంధన రంగంలో విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్‌లోని అణు ఇంధన సంస్థ (ఎన్ఎఫ్సీ) ఛైర్మన్, సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త కళ్యాణ క్రిష్ణన్ నియమితులయ్యారు. రెండేళ్ల పదవికాలం ముగియడంతో ఎన్ఎఫ్సీ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరించిన ఎన్.సాయిబాబ బుధవారం పదవివిరమణ పొందారు. ఎన్ఎఫ్సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న జీ కళ్యాణకృష్ణన్కు ఎన్ఎఫ్సీ కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అణు ఇంధన ఉత్పత్తిలో ఎన్ఎఫ్సీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో కళ్యాణ క్రిష్ణ తనవంతు కృషి చేశారు. 1980 ఆర్ఈసీ(ప్రస్తుత ఎన్ఐటీ-వరంగల్)లో కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ముంబైలో ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో(24వ బ్యాచ్)లో చేరి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ప్రావీణ్యం పొందారు. రాజస్తాన్‌లో కోటాలోని అణు ఇంధన సంస్థలో హెవీ వాటర్ బోర్డులో పని చేశారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్ల(ఐఐసీహెచ్ఈ)ల సభ్యుల్లో కళ్యాణ క్రిష్ణన్ ఒకరు. జిర్కోనియం కాంప్లెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కళ్యాణ క్రిష్ణన్ చేసిన కృషికిగానూ డీఏఈ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు. -
ఎన్ఎఫ్సీలో ఉద్యోగాల పేరిట మోసం
హైదరాబాద్: అణు ఇంధన సంస్థ(ఎన్ఎఫ్సీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడకు చెందిన నూకరాజు మురళి, మమతకలసి ఎన్ ఎఫ్‌సీ అధికారి గోవర్దన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఉద్యోగార్థులకు కాల్ లెటర్లు జారీ చేశారు. అయితే, అవి నకిలీవని తేలటంతో బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు మురళి, మమతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ట్రాన్స్ ఫర్ చేయలేదని ఆత్మహత్య
హైదరాబాద్: తను కోరుకున్న చోటకి బదిలీ చేయలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. స్థానిక ఎన్‌ఎఫ్‌సిలో నరేందర్ కుమార్(24) అనే యువకుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనను కోరుకున్న చోటికి యాజమాన్యం బదిలీ చేయకపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు రూ.5.40 కోట్లు
హూస్టన్: మెదడుపై కీలక పరిశోధన చేస్తున్న భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీల్ రెజాక్కు ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్ఎఫ్సీ)’ భారీ మొత్తంలో రూ 5.40 కోట్ల(8.66 డాలర్లు) గ్రాంటును ప్రకటించింది. రోజువారీ జీవితంలో శబ్దాలను మెదడు ఎలా విశ్లేషిస్తుంది? అన్న కోణంలో తదుపరి పరిశోధన నిర్వహించేందుకుగాను ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కింద ఖలీల్‌కు ఈ మొత్తం గ్రాంటు లభించింది. ఈ నిధులను దశలవారీగా ఐదేళ్లలో ఎన్ఎఫ్సీ అందించనుంది. ఖలీల్ పరిశోధనలు ఓ కొలిక్కి వస్తే గనక... వయసు రీత్యా వచ్చే వినికిడి సమస్యలకు కొత్త చికిత్సలు కనుగొనేందుకు మార్గం సుగమం కానుంది.