
కుషాయిగూడ: అణు విద్యుత్ ఉత్పత్తిలో నిరంతరాయంగ సేవలందింస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంఫ్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ) మరో మైలురాయిని దాటింది. సంస్థ తయారు చేసే పవర్ బండిల్స్ ఉత్పత్తి మిలియన్ (10లక్షలు)లకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం ఎన్‌ఎఫ్‌సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా çహా జరైన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ యస్‌కే శర్మకు ఎన్‌ఎఫ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ శ్రీవాస్తవ పవర్ బండిల్స్‌ను అందజేశారు. అందుబాటులో అన్ని ఎఫర్ట్స్‌ను ఉపయోగిం చి సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి తోడ్పాటునందిస్తున్న ఎన్‌ఎఫ్‌సీ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment