Central public sector organizations
-
గడువులోగా విక్రయించకపోతే, నిధుల కోత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్‌యూ)లు కీలకం కాని తమ ఆస్తుల విక్రయాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ సీపీఎస్‌యూలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధిస్తారు. ఈ మేరకు సీసీఎస్యూల ఆస్తుల విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను దీపమ్ జారీ చేసింది. దీంతో పాటు శతృ సంస్థల స్థిరాస్థుల విక్రయానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా దీపమ్ వెల్లడించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.., దీపమ్ కార్యదర్శి అధ్యక్షతన గల అంతర మంత్రిత్వ సంఘం(ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్–ఐఎమ్జీ) సీపీఎస్‌యూల కీలకం కాని ఆస్తులను గుర్తిస్తుంది. ఇలా గుర్తించడంలో ఐఎమ్జీ స్వతంత్రంగా గానీ, నీతి ఆయోగ్ సూచనలను గానీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆర్థిక మంత్రి, రహదారుల మంత్రి, సంబంధిత శాఖ నిర్వహణ మంత్రులు సభ్యులుగా గల ఆల్టర్నేటివ్ మెకానిజమ్.. సీపీఎస్‌యూ విక్రయించాల్సని ఆస్తులకు ఆమోదం తెలుపుతుంది. ఈ ఆమోదం పొందిన ఏడాదిలోపు సదరు ఆస్తుల విక్రయం జరిగాల్సి ఉంటుంది. ఈ ఆస్తుల విక్రయానికి కావాలంటే కొంత గడువును సీపీఎస్‌యూలు కోరవచ్చు. మరోవైపు శతృసంస్థల స్థిరాస్తులను హోమ్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. -
మరో మైలురాయి దాటిన ఎన్ఎఫ్సీ
కుషాయిగూడ: అణు విద్యుత్ ఉత్పత్తిలో నిరంతరాయంగ సేవలందింస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ న్యూక్లియర్ ప్యూయల్ కాంఫ్లెక్స్ (ఎన్ఎఫ్సీ) మరో మైలురాయిని దాటింది. సంస్థ తయారు చేసే పవర్ బండిల్స్ ఉత్పత్తి మిలియన్ (10లక్షలు)లకు చేరింది. ఈ సందర్భంగా మంగళవారం ఎన్ఎఫ్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా çహా జరైన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ యస్కే శర్మకు ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దినేశ్ శ్రీవాస్తవ పవర్ బండిల్స్‌ను అందజేశారు. అందుబాటులో అన్ని ఎఫర్ట్స్‌ను ఉపయోగిం చి సమన్వయంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్నారు. అణువిద్యుత్ ఉత్పత్తి తోడ్పాటునందిస్తున్న ఎన్ఎఫ్సీ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలన్నారు. -
కేంద్ర సంస్థలపై రాజకీయ ప్రభావం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై కొంత రాజకీయ ప్రభావం ఉంటుందని, అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహాయింపు కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ‘ఆర్బీఐ–మేకింగ్ ఏ డిఫరెన్స్ టు ఎవ్రీడే లైవ్స్’ అనే అంశంపై అక్కడ ప్రసంగించారు. ఆర్బీఐ కేవలం నోట్ల ముద్రణ, పంపిణీ ప్రక్రియే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా వ్యవహరిస్తోం దన్నారు. ద్రవ్య విధానం రూపకల్పన, ఆర్థిక సంస్థల పర్యవేక్షణలో ఆర్బీఐ నిర్ణయాలు ముఖ్యమైనవని తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలిచ్చి, వాటిపై రెపో రేటును విధిస్తుందన్నారు. ఈ బ్యాంకుల ద్వారా ప్రజలు రుణాలు పొందే విధానాన్ని సైతం నిర్వహిస్తోందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నా వాటి ప్రభావం మన దేశంపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం, ఉగ్ర కార్యకలాపాలు, దొంగ నోట్ల చలామణికి అడ్డుకట్ట పడిందన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చడం మంచిదని, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు వీలు కల్పిస్తుందన్నారు. ఎఫ్ఆర్డీఏతో బ్యాంకులు, ఖాతాదారు లకు ఎలాంటి నష్టం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ డబ్ల్యూఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘స్వగృహా’లపై కేంద్ర సంస్థల కన్ను
సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనేందుకు ఆసక్తి హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన అపార్ట్మెంట్లను టోకున కొనేందుకు కేంద్రప్రభుత్వరంగ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం నగరంలో బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌లలో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ మూడు చోట్ల కలిపి 8 వేల అపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. బండ్లగూడలో కొన్ని బ్లాక్లవద్ద మౌలిక వసతుల కల్పన పూర్తయినా... మిగతా చోట్ల సిద్ధం కాలేదు. దీంతో వాటిని కొనేందుకు సాధారణ ప్రజలు ఉత్సాహం చూపడం లేదు. ఉమ్మడి రాష్ట్రం లో ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపకపోవడం, సరైన పర్యవేక్షణ లేక కార్పొరేషన్ అప్పుల్లో మునిగి దివాళా తీయడంతో సొంత వనరులు లేక పనులు ముందు కు సాగలేదు. దీంతో సీఆర్పీఎఫ్ సహా మరికొన్ని కేంద్రప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు అపార్ట్మెంట్లను బల్క్‌గా కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయి. త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపేందుకు సిద్ధమైనట్టు సమాచారం. గతంలో ముందుకొచ్చినా... శివారులోని జవహర్‌నగర్‌లో దాదాపు 2800 అపార్ట్మెంట్లతో భారీ గృహసముదాయం సిద్ధమైంది. మౌలిక వసతుల కల్పించి, తుదిమెరుగులు చేయకపోవడంతో దాదాపు రెండేళ్లుగా వృథాగా ఉంది. దీనికి సమీపంలోని ఆల్వాల్‌లో సీఆర్పీఎఫ్ అనుబంధ దళం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) ప్రధాన కేంద్రం ఉంది. అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలంతా ఒకేచోట ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గృహసముదాయాన్ని కొనుగోలు చేసేందుకు సీఆర్పీఎఫ్ ఆసక్తి చూపి నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని సంప్రతించింది. అయితే ఈ గృహసముదాయాన్ని వీలైనంత చవకగా ప్రైవేటు నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సొంతలాభం చూసుకునే ఆలోచనతో ఓ ఉన్నతాధికారి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సీఆర్పీఎఫ్ అధికారులకు సహకరించకపోగా... సమీపంలోనే డంపింగ్‌యార్డు ఉన్నందున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ బెదరగొట్టారు. దీంతో ఆ బేరం కాస్తా ఎత్తిపోయింది. స్వగృహకు అప్పులిచ్చిన కొన్ని బ్యాంకులు కూడా తమ సిబ్బంది కోసం అపార్ట్మెంట్లు కొనేందుకు యత్నించినా ఆ అధికారి కుదరనివ్వలేదు. బ్యాంకులకు ఇళ్లను అమ్మితే అప్పుకూడా తీరిపోయినట్టవుతుంది. ప్రైవేటు సంస్థలకు ఆ ఇళ్లను అమ్మేసేందుకు అవకాశం కావాలంటూ రాష్ట్రం విడిపోయేందుకు కొద్దిరోజుల ముందు స్వగృహ కార్పొరేషన్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు సర్కారు కూడా అంగీకరించింది. ఇదే అదనుగా ఆ ఇళ్లను ప్రైవేటు నిర్మాణ సంస్థలకు ఎంతోకొంతకు అప్పగించే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి సీఆర్పీఎఫ్, బ్యాంకులు వాటిపై ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఎనిమిదివేల వరకు అపార్ట్మెంట్లతో కూడి మూడు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నందున వాటిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆరే గృహనిర్మాణ శాఖను పర్యవేక్షిస్తున్నందున త్వరలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. కాగా, స్వగృహ కార్పొరేషన్‌ను ఉన్నదున్నట్టుగా కొనసాగించొద్దని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. దాన్ని హౌసింగ్‌బోర్డులో విలీనం చేసే అవకాశం కూడా లేకపోలేదు.