సాక్షి, కామారెడ్డి : అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలంగాణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరుణ్‌కుమార్ మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బూర్ల అరుణ్ కుమార్(21) భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. బూర్ల చంద్రశేఖర్, పద్మల కుమారుడైన అరుణ్ కుమార్ 16 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి హ్యూస్టన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడడంతో ఆయన మరణించినట్లు బంధువులు వెల్లడించారు. అరుణ్‌కుమార్‌కు భార్య రజనీ, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అరుణ్ కుమార్ మృతదేహాన్ని భారత్ తెప్పించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment