హ్యూస్టన్: అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్) ఔషధం కరోనాకు విరుగుడుగా ఉపయోగపడుతోందని పరిశోధనల్లో తేలింది. దీనిని సాధారణంగా ముక్కు ద్వారా పీల్చడం ద్వారం అంగస్తంభన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ ఔషదాన్ని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కరోనా బాధితులకు బహుళ క్లినికల్ సైట్లలో అత్యవసరంగా ఉపయోగించడం కోసం ఎఫ్‌డీఏ చేత ఆమోదించబడింది. చికిత్సలో వాడిన తర్వాత వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు వేగంగా కోలుకున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ నివేదించింది. ఈ మందు పేటెంట్ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్ కంపెనీ రిలీఫ్ థెరపాటిక్స్, ఇజ్రాయెలీ-అమెరికన్ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలను నిర్వహించనున్నారు. ఈ ఔషధాన్ని ఉపయోగించి కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు జూన్ నెలలో అనుమతులు లభించాయి. (కరోనా; అద్భుతమైన వ్యాక్సిన్ తయారు)
అమెరికాలోని హ్యూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో అతనికి కరోనా సోకింది. ఈ క్రమంలో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో అతనికి ఆర్ఎల్‌ఎఫ్-100 ఔషదాన్ని ఇచ్చారు. అతడి ఆరోగ్యం నాలుగు రోజుల వ్యవధిలోనే మెరుగుపడి వెంటిలేటర్‌పై నుంచి జనరల్ వార్డుకు మారారు. మరో 15 మంది కూడా ఇదే విధంగా త్వరగా కోలుకున్నారు. దీంతో మరి కొందరిపై ప్రయోగాలు చేయాలని వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగ ఫలితాలు మరింత సానుకూలంగా వస్తే కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది. కాగా.. ఆర్‌ఎల్‌ఎఫ్-100 ఔషదం వాడటం వల్ల మోనోసైట్స్‌లో తెల్లరక్తకణాల సంఖ్య వృద్ధి చెందకుండా నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
శృంగార ఔషధంతో కరోనా కట్టడి!
Published Fri, Aug 7 2020 10:52 AM | Last Updated on Fri, Aug 7 2020 12:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment