హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌ | Pakka Local Song For Howdy Modi Event | Sakshi
Sakshi News home page

పక్కా లోకల్చల్‌

Published Thu, Sep 26 2019 1:25 AM | Last Updated on Thu, Sep 26 2019 4:57 AM

Pakka Local Song For Howdy Modi Event - Sakshi

ఏదైనా ఒక చరిత్రాత్మక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చాలా అరుదుగా దొరికే అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతివారూ విశేషమైన కృషి చేస్తారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో సెప్టెంబరు 22వ తేదీన ‘హౌడీ మోడీ’ (ఎలా ఉన్నారు మోదీ) అనే ప్రతిష్ఠాత్మక  కార్యక్రమం జరిగింది. మన ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇద్దరూ చేతులు కలిపి, స్టేడియమంతా కలియతిరిగారు. ఇదంతా ఒక ఘట్టం. వీరి ప్రసంగానికి ముందు సుమారు మూడు గంటలపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో గుజరాతీలు వారి సంప్రదాయ నాట్యంతో ఎరుపు తెలుపు దుస్తులతో ముచ్చటగొలుపుతూ, కన్నుల పండుగ చేశారు.

కార్యక్రమం సిక్కుల ప్రార్థనతో ప్రారంభమైంది. ఆ తరవాత పాఠశాల విద్యార్థులు హిందీ పాటకు నాట్యం చేశారు. కేరళ వారు వారి సంప్రదాయమైన మోహినీ ఆట్టం నాట్యం చేశారు. ఒరియన్‌లు ఒడిస్సీ.  బెంగాలీలు బెంగాలీ ఫోక్‌ డాన్స్‌. పంజాబీలు భాంగ్రా. వీళ్లతో పాటు అమెరికన్లు పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇన్ని సంప్రదాయ నృత్యాల మధ్య మన తెలుగువారు.. ‘నేను పక్కా లోకల్‌’ అంటూ జనతా గ్యారేజీ చిత్రంలోని పాటకు డ్యాన్స్‌ చేశారు! సంప్రదాయ విరుద్ధమైన ఒక సినిమా పాటకు నాట్యం చేసి, మంచి అవకాశాన్ని జారవిడుచుకోవడం విజ్ఞత గల పనేనా?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement