Pakka Local
-
రెడ్ ఎఫ్ఎం ‘పక్కా లోకల్’ కార్యక్రమంలో ‘తీస్మార్ఖాన్’ టీమ్ సందడి
-
హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్
ఏదైనా ఒక చరిత్రాత్మక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. చాలా అరుదుగా దొరికే అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతివారూ విశేషమైన కృషి చేస్తారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో సెప్టెంబరు 22వ తేదీన ‘హౌడీ మోడీ’ (ఎలా ఉన్నారు మోదీ) అనే ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరిగింది. మన ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీ ప్రసంగించారు. ఇద్దరూ చేతులు కలిపి, స్టేడియమంతా కలియతిరిగారు. ఇదంతా ఒక ఘట్టం. వీరి ప్రసంగానికి ముందు సుమారు మూడు గంటలపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అందులో గుజరాతీలు వారి సంప్రదాయ నాట్యంతో ఎరుపు తెలుపు దుస్తులతో ముచ్చటగొలుపుతూ, కన్నుల పండుగ చేశారు. కార్యక్రమం సిక్కుల ప్రార్థనతో ప్రారంభమైంది. ఆ తరవాత పాఠశాల విద్యార్థులు హిందీ పాటకు నాట్యం చేశారు. కేరళ వారు వారి సంప్రదాయమైన మోహినీ ఆట్టం నాట్యం చేశారు. ఒరియన్లు ఒడిస్సీ. బెంగాలీలు బెంగాలీ ఫోక్ డాన్స్. పంజాబీలు భాంగ్రా. వీళ్లతో పాటు అమెరికన్లు పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇన్ని సంప్రదాయ నృత్యాల మధ్య మన తెలుగువారు.. ‘నేను పక్కా లోకల్’ అంటూ జనతా గ్యారేజీ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేశారు! సంప్రదాయ విరుద్ధమైన ఒక సినిమా పాటకు నాట్యం చేసి, మంచి అవకాశాన్ని జారవిడుచుకోవడం విజ్ఞత గల పనేనా?! -
నాని కోసం ఎన్టీఆర్ పాట?
మన కథానాయకులు, నాయికలు తమ చిత్రాలకు కొత్త హైప్ తీసుకొచ్చేందుకు పాటలు పాడేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. అయితే ఓ హీరో కోసం మరో స్టార్ హీరో పాట పాడుతుండడం విశేషమనే చెప్పాలి. నాని హీరోగా త్రినాథరావు దర్శకత ్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ పాట పాడనున్నారని ఫిలింనగర్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో తన చిత్రాలు ‘యమ దొంగ’, ‘అదుర్స్’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’లో పాటలు పాడిన ఎన్టీఆర్, కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం ఆ మధ్య కన్నడంలోనూ ఓ పాట పాడారు. ఆ పాటలన్నీ బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ‘నేను లోకల్’ కోసం మరోసారి తను సింగర్‌గా మారనున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్, ‘దిల్’ రాజులతో ఉన్న స్నేహం వల్లే తారక్ మళ్ళీ ఇలా సింగర్ అవతారమెత్తుతున్నారని తెలుస్తోంది.