హూస్టన్: అగ్రరాజ్యం అమెరికా కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. తాజాగా హూస్టన్లో ఓ పుట్టినరోజు వేడుకలో దుండగులు జరిపిన మహిళ సహా ఇద్దరు మృతి చెందారు. 22 మంది గాయపడ్డారు. సిప్రస్ ప్రాంతంలోని క్రీక్ డ్రైవ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపినట్టు భావిస్తున్న ఇద్దరు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.
కాల్పులు జరిగినప్పుడు పుట్టినరోజు వేడుకలో వందమందిపైగా యువతీ యువకులున్నారని అధికారులు తెలిపారు. పార్టీలో జరిగిన గొడవ కాల్పులకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు కాల్పులకు దిగడంతో అక్కడున్నవారంతా భయాందోళనతో పరుగులు తీశారు. కొంత మంది రెండో అంతస్థు నుంచి అద్దాలు పగులగొట్టుకుని కింద దూకేశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పుట్టినరోజు వేడుకలో కాల్పులు; ఇద్దరు మృతి
Published Sun, Nov 10 2013 8:49 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement
Advertisement