సెమీస్‌లో దీపిక | deepika in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో దీపిక

Published Sun, Apr 13 2014 12:03 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

సెమీస్‌లో దీపిక - Sakshi

సెమీస్‌లో దీపిక

 
 టెక్సాస్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ
 
 హౌస్టన్ (అమెరికా): భారత నెంబర్‌వన్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ టెక్సాస్ ఓపెన్ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం నికోలెట్ ఫెర్నాండెజ్ (గయానా)తో హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 11-4, 11-6, 10-12, 10-12, 11-5 తేడాతో గెలుపొందింది.

ప్రపంచ 12వ ర్యాంకర్ దీపిక ఇక సెమీస్‌లో ఎనిమిదో ర్యాంకర్ మెడలిన్ పెర్రీ (ఐర్లాండ్)తో తలపడనుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో మెడలిన్ పెర్రీ 11-7, 9-11, 11-6, 11-8 తేడాతో ఎమ్మా బెడ్డోస్ (ఇంగ్లండ్)పై గెలుపొందగా, ఈజిప్టు అన్‌సీడెడ్ క్రీడాకారిణి నౌర్ ఎల్ షెర్బిని చేతిలో టాప్‌సీడ్ లో వీ వర్న్ (మలేసియా) 3-11, 8-11, 12-10, 6-11 తేడాతో కంగుతింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement