
హోస్టన్ : హోస్టన్‌లో వైఎస్సార్‌సీపీ కార్య కర్తలు అందరు ఒక్క చోట చేరి వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భాన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కార్య కర్తలు అందరూ వైఎస్ జగన్ పట్టుదలను, మొక్కవోని ధైర్యాన్ని కొనియాడారు. పాదయాత్రలో దాదాపు పద్నాలుగు నెలలు అయన పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు.
అందరు రాబోయే ఎన్నికల గురుంచి, పార్టీకి ఎలా తోడ్పాటు అందించాలి అనే అంశాన్ని చాలా సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే కార్య క్రమాల ప్రణాలికను కూడా చర్చించారు. తరువాత అందరు కేక్ కట్ చేసి, జోహార్ వైఎస్సార్, జై జగన్, రావాలి జగన్ కావాలి జగన్ నినాదాలతో హోరెత్తించారు.