
హూస్టన్ : కరోనా బాధితుడి ఆవేదన విని కరిగిపోయి ఆలింగనం చేసుకున్న వైద్యుడి ఫొటో అమెరికా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన సేవల పట్ల జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హూస్టన్‌లోని యునైటెడ్ మెమోరియల్ మెడికల్ సెంటర్‌లో డాక్టర్ జోసెఫ్ వరోన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేస్తున్నారు. 252 రోజులుగా కరోనా బాధితుల సేవలోనే నిమగ్నమయ్యారు. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా తనకు సెలవు అయినప్పటికీ పీపీఈ కిట్ ధరించి, విధులకు హాజరయ్యారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్న ఓ బాధితుడు తన గోడు చెప్పుకోగా, డాక్టర్ జోసెఫ్ తీవ్రంగా చలించిపోయారు. వెంటనే ఆ బాధితుడిని సానుభూతితో ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఫొటో వెంటనే సోషల్ మీడియాలో పాకిపోయింది. (స్వల్ప అస్వస్థతకు గురైన బైడెన్)
Comments
Please login to add a commentAdd a comment