
వాషింగ్టన్ : అమెరికాలో భారత సంతతికి చెందినవారి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన ఘటనలో హ్యూస్టన్‌కు చెందిన చక క్యాస్ట్రో(44) అనే మహిళను మిచిగన్ కోర్టు దోషిగా తేల్చింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ముందుగా ఎంపిక చేసి కొన్ని ఇళ్లను చక క్యాస్ట్రో టార్గెట్‌గా నిర్దేశించేది. అనంతరం ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడేది. ముఖ్యంగా ఆసియా సంతతికి చెందిన వారు, భారతీయులని లక్ష్యంగా చేసుకుని చక క్యాస్ట్రో లక్ష్యాలను నిర్దేశించేది. 2011 నుంచి 2014 మధ్యలో అమెరికాలోని జార్జియా, న్యూయార్క్, ఒహియో, మిచిగన్, టెక్సాస్‌లలో వరుస దోపిడీలకు పాల్పడింది. బాధితులను తుపాకులు, మారణాలయుధాలతో బెదిరించి ఈ ముఠా దోపిడీ చేసేది. గుర్తుపట్టకుండా మారువేషాలతో చోరీలు చేసేవారు. వరుస చోరీల కేసులో చక క్యాస్ట్రోను దోషిగా తేల్చిన మిచిగన్ కోర్టు సెప్టెంబర్‌లో శిక్ష ఖరారు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment