షాకింగ్‌ : గన్‌తో పేల్చుకున్న రెండేళ్ల చిన్నారి | Shocking! Toddler Finds Loaded Gun In House; Shoots Himself Dead | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ : గన్‌తో పేల్చుకున్న రెండేళ్ల చిన్నారి

Published Mon, Jul 9 2018 7:47 PM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

Shocking! Toddler Finds Loaded Gun In House; Shoots Himself Dead - Sakshi

ఇంట్లో ఆడుకుంటూ గన్‌తో పేల్చుకున్న చిన్నారి

టెక్సాస్‌ : చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారు తెలిసీ తెలియకుండా చేసే పనులు ఒక్కోసారి ప్రాణాలు మీదకు తెస్తాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా హోస్టన్‌లో షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. ఓ రెండేళ్ల చిన్నారి ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి.. అక్కడే బుల్లెట్లు లోడ్‌ చేసి ఉన్న గన్‌తో తనకు తానుగా కాల్చుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ వారేమీ చేయలేకపోయారు. చిన్నారిని టెక్సాస్‌లోని పిల్లల ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన ఒక రోజు అనంతరం చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడని తెలిసింది.  ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం హోస్టన్‌లో జరిగింది. 

ప్రాథమిక విచారణ ప్రకారం, సురక్షితం కాని లోడెడ్‌ గన్‌తో తనకు తానుగా పేల్చుకోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. లోడ్‌ చేసిన 9 ఎంఎం పిస్టల్‌ను ఈ చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో పట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. చిన్నారి ఆ గన్‌తో ఆడుకుంటూ తలకు గురిపెట్టుకుని ట్రిగర్‌ నొక్కుకున్నాడని.. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి గన్‌తో పేల్చుకుంటున్న సమయంలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారిని కాపాడుకోలేకపోయారు. వారికి ఏమైనా శిక్ష విధించాలా? అనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి ఓ పాఠంలా ఉందని పలువురు అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement