
హ్యూస్టన్: హూస్టన్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకున్న కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ఓ అపార్ట్‌మెంట్ భవనానికి నిప్పుపెట్టిన ఓ వ్యక్తి అందులోని వారు బయటకు రాగానే షాట్‌గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో గాయపడిన ఐదుగురిలో ముగ్గురు చనిపోయారు. అగ్ని ప్రమాదం సంభవించేందనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బందిపైనా కాల్పులకు దిగాడు. పోలీసుల కాల్పుల్లో చివరికి అతడు హతమయ్యాడు.