హరికేన్ హార్వి ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణుకుతోంది.

గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదైంది. హూస్టన్ సిటీలో పలు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చాలా ఇళ్లు ధ్వంసంకాగా.. 15 మంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ షెల్టర్లలో కాలం గడుపుతున్నారు.

