Hurricane Harvey
-
భీకర హరికేన్ ధాటికి అతలాకుతలమైన కరేబియన్ కంట్రీ బార్బడోస్ (ఫొటోలు)
-
హరికేన్ బాధితులకు నటి భారీ విరాళం
లాస్ఏంజిలెస్ : హార్వీ, ఇర్మా, మారియా హరికేన్లు ఒకదాని తరువాత ఒకటి అమెరికాను కకావికలం చేసిన విషయం తెలిసిందే. ఈ వరుస విపత్తులతో వేలాదిమంది రోడ్డునపడ్డారు. కాగా వీరిని ఆదుకునేందుకు ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ ఆనిస్టన్ భారీ విరాళాన్ని ప్రకటించి, తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విపత్తుల్లో సర్వం కోల్పోయిన వారిని ఆదుకొని, వారి జీవితాలను నిలబెట్టేందుకు ప్యూర్టోరికో రిలీఫ్‌ఫండ్‌కు 10 లక్షల డాలర్లను జెన్నీఫర్ విరాళంగా ప్రకంటించారు. ఈ మొత్తంలో ఐదులక్షల డాలర్లను అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థకు, మరోక ఐదు లక్షలను సింగర్ రికీ మార్టిన్ పౌండేషన్‌కు అందజేయాలని సూచించారు. విరాళంపై సంతోషం వ్యక్తం చేసిన మార్టిన్.. జెన్నీఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ... 'ఈ మేలును ఎప్పటికీ మరువలేం. ఈ సాయం అనేకమంది జీవితాలను నిలబెడుతుందంటూ' ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా ఇప్పటికే స్టార్ హీరో, అస్కార్ నటుడు లియోనార్డో డికాప్రియో, జెన్నీఫర్ లోపేజ్, నిక్ రోల్, స్టీఫెన్ కోల్బర్ట్ తదితర హాలీవుడ్ నటులెందరో తమ వంతుగా బాధితులకు సాయం అందించారు. -
ప్రవాస జంట పెద్ద మనసు
హూస్టన్: హరికేన్ హార్వీ బాధితుల సహాయార్థం ఓ భారతీయ అమెరికన్ జంట రూ. 1.6 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. హరికేన్ హార్వీ రిలీఫ్ పేరిట ఆదివారం హూస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రేటర్ హూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ తరఫున అమిత్ భండారీ, అర్పితా భండారీలు విరాళాన్ని హూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా టర్నర్ మాట్లాడుతూ హార్వీ తుపాను బాధితులను ఆదుకోవటానికి భారతీయ అమెరికన్లు ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు. హూస్టన్ నగరాభివృద్ధికి భారతీయులు ఎంతో కృషి చేశారని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే తుపానులను మరింత సమర్ధవంతగా ఎదుర్కొనేలా నగరాన్ని తిరిగి పునర్నిర్మిస్తామని వెల్లడించారు. గ్రేటర్ హూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా 700 మందిని రక్షించామని అమిత్ భండారీ తెలిపారు. హార్వీ బాధితులకు సహాయం అందించే వివిధ చారిటీలకు ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.9.7కోట్లు సమకూర్చామన్నారు. బయోఉర్జా గ్రూప్‌కు అమిత్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈనెల ప్రారంభంలో అమెరికాను వణికించిన హార్వీ ధాటికి 70 మంది మరణించగా, 30 వేలమంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే -
టెక్సాస్‌కు పర్యావరణ ముప్పు
60కి చేరిన హరికేన్ హార్వీ మృతులు హూస్టన్: హరికేన్ హార్వీ సృష్టించిన అలజడికి కకావికలమైన అమెరికా రాష్ట్రం టెక్సాస్‌కు ఇప్పుడు పర్యావరణ ముప్పు పొంచిఉంది. హరికేన్ హార్వీ బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా అమెరికా అర్థిక వ్యవస్థకు హార్వీ కారణంగా సుమారు రూ.11.54 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా, హరికేన్ హార్వీ వల్ల సంభవించిన పర్యవరణ మార్పులతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సురక్షిత ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు బాటిల్ వాటర్‌నే తాగాలని, సర్జికల్ మాస్క్‌లు, కాలివేళ్లను మూసి ఉంచే షూస్, చేతి తొడుగులను వినియోగించాలని సూచించారు. కరీబియన్ దీవుల వైపుగా హరికేన్ ఇర్మా దూసుకువస్తోందని అమెరికా వాతావరణ విభా గం హెచ్చరించింది. కేటగిరి 4 తీవ్రత గల ఈ హరికేన్ ప్రభావం ప్యూర్టోరికో, ఫ్లోరిడా, కరీబియన్ దీవులపై ఎక్కువ ఉంటుందని, గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. -
డొనేషన్ల పేరిట మోసం..
హూస్టన్: హరికేన్ హార్వీ ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణుకుతుండగా మరో వైపు దుండగలు డొనేషన్ల పేరిట రెచ్చిపోతున్నారు. వరదల్లో చిక్కుకోని నిరాశ్రయులైన వారికి అండగా అనేక మంది డొనేషన్లు ఇస్తుండగా వీరినే ఆసరాగా చేసుకుంటున్నారు. అయితే డొనేషన్లు ఇచ్చేవారు అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ డిపార్ట్మెంట్ నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ ఫ్రాడ్ డైరెక్టర్ వాల్ట్ గ్రీన్ హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడల్లా సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫేక్ యూఆర్‌ఎల్‌లతో సైబర్ నేరగాళ్లు డొనేషన్ ఇచ్చేవారి నుంచి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. ప్రతీ ఏడాది జాతీయ వాతావరణ శాఖ ఆ ఏట విడుదల చేసే తుఫాను పేర్ల వివరాలను తెలుసుకొని వాటిపై ఆన్లైన్ డొమైన్స్( ప్రభుత్వానికి చెందినది) రిజిస్టర్ చేసుకుంటున్నారని వాల్ట్ గ్రీన్ పేర్కొన్నారు. కొందరు డొమైన్స్ ద్వారా కాకుండా వ్యక్తిగత ఈ మెయిల్ ద్వారా డబ్బులు అడుగుతారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాల్ట్ గ్రీన్ సూచించారు. విపరీతంగా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అక్కడ కర్ఫ్యూ విధించింది. లూటీలు, దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్న విషయం తెలిసిందే. వరదలో చిక్కుకున్నవారికి సహాయం చేసేందుకు వెళ్లే బృందాలు, వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు. -
చిగురుటాకులా వణుకుతున్న హూస్టన్
► నగరంలో కర్ఫ్యూ విధించిన అధికారులు ► రికార్డు స్థాయిలో వర్షం వాషింగ్టన్: హరికేన్ హార్వి ధాటికి అమెరికాలోని హూస్టన్ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. విపరీతంగా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది. లూటీలు, దొంగతనాలు, ఇతర నేరాలను అదుపు చేయడానికి కర్ఫ్యూ విధించినట్లు హూస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ పేర్కొన్నారు. వరదలో చిక్కుకున్నవారికి సహాయం చేసేందుకు వెళ్లే బృందాలు, వ్యక్తులకు మినహాయింపు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఇక్కడ వర్షపాతం నమోదైంది. హూస్టన్ సిటీలో పలు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. చాలా ఇళ్లు ధ్వంసంకాగా.. 15 మంది చనిపోయారు. వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ షెల్టర్లలో కాలం గడుపుతున్నారు. -
హార్వీ తుఫాన్: భారతీయ విద్యార్థి మృతి
► మరొకరి పరిస్థితి విషమం సాక్షి, హైదరాబాద్: హార్వీ తుఫాన్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ విద్యార్థి నిఖిల్ భాటియా బుధవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికా టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం విశ్వ విద్యాలయంలో చదువుతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్‌లు గత శనివారం ఈత కొట్టేందుకు బ్య్రాన్ సరస్సుకు వెళ్లారు. అయితే హార్వీ హారికేన్ ముంచెత్తడంతో ఇద్దరూ మునిగిపోయి దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉండగా సహాయక సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజులుగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థతి విషమించి నిఖిల్ భాటియా బుధవారం మృతి చెందగా, షాలినీ ఆరోగ్య పరిస్థతి విషమంగానే కొనసాగుతోంది. కాన్సులేట్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. నిఖిల్ భాటియా స్వస్థలం రాజస్థాన్‌లోని జైపూర్. షాలిని సింగ్ ఢిల్లీ నివాసి వీరిద్దరూ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు. మరోవైపు హూస్టన్ చుట్టుపక్కల నివసిస్తున్న దాదాపు లక్ష మంది భారతీయ అమెరికన్లపై కూడా తుపాను ప్రభావం భారీగా ఉంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించా రు. 200 మందికిపైగా భారతీయ విద్యార్థులు ఇళ్లలో చిక్కుకుపోగా వారికి భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. భారతీయుల సహాయార్థం ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా హూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే ట్వీటర్లో పోస్ట్ చేశారు. -
హరికేన్ బీభత్సం.. టెక్సాస్ అతాలాకుతలం
హూస్టన్: హరికేన్ హార్వే ధాటికి టెక్సాస్ విలవిల్లాడుతోంది. ఈ ప్రకృతి విలాపానికి ఐదుగురు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. గంటకు 130 కీ.మీ వేగంతో వీస్తున్న గాలుల కారణంగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కనీసం మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. హూస్టన్, హారిస్కౌంటీలలో గత 24 గంటల్లో 30 అంగుళాల మేర వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో వంద సెం.మీ వరకు వర్షపాతం నమోదు కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హూస్టన్ మేయర్ సిల్విస్టర్ టర్నర్ హెచ్చరించారు. వచ్చే వారంరోజులూ భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు. హరికేన్ విధ్వంసానికి కుప్పకూలిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగించడానికి రెండు వేల మంది సైనికులను రంగంలోకి దించినట్లు టెక్సాస్ గవర్నరు గ్రెగ్ అబాట్ తెలిపారు. హార్వే ధాటికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహకరించడానికి, కనిపించకుండా పోయినవారిని వెదకడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మరో వెయ్యిమంది సహాయక సిబ్బందిని నియోగించినట్లు చెప్పారు. హార్వే కారణంగా లూసియానాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 60 లక్షల మంది హార్వే కారణంగా ఇబ్బంది పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఫోర్ట్ బెండ్ కౌంటీలో 50 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2004లో హరికేన్ చార్లీ ఫ్లోరిడాలో తన ప్రతాపం చూపిన తరువాత, అమెరికాలో ఈ స్థాయిలో విరుచుకుపడింది హార్వేనే కావడం గమనార్హం. 1961లో హరికేన్ కార్లా కూడా టెక్సాస్‌ను అతలాకుతలం చేసింది.