
వైద్యుడ్ని కాల్చి ఆపై యువకుడు ఆత్మహత్య
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఎల్ పెసో వీఏ హెల్త్ కేర్ సెంటర్లో ఓ వ్యక్తి విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో వైద్యుడు మృతి చెందాడు. అనంతరం ఆ వ్యక్తి తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆసుపత్రి వాతావరణ భయానకంగా మారింది.
ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.