
వాషింగ్టన్: శత్రువుల కంట పడకుండా ఉండేందుకు ఊసరవెల్లి తన రంగులు మార్చుకుంటుందని, పరిసరాల్లోకి ఒదిగిపోతుందని మనకు తెలుసు. కరోనా వైరస్ కూడా ఇంతే. ఇది మన రోగ నిరోధక వ్యవస్థ దృష్టిలో పడకుండా ఉండేందుకు ఎన్‌ఎస్‌పీ16 అనే ఎంజైమ్‌ను వాడుకుంటుందని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది.
ఎన్‌ఎస్‌పీ16 ఎంజైమ్ ఉన్న వైరస్‌ను రోగనిరోధక వ్య వస్థ గుర్తించడం లేదని, అది కణంలో భాగంగానే భావించేందుకు ఆ ఎంజైమ్ ఉపయోగపడుతుం దని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా తెలిపారు. ఈ కొత్త విషయం కారణంగా ఆ ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ తన పని తాను చేసుకుపోయేలా చేయవచ్చు. అంటే.. పరిస్థితి చేయి దాటక ముందే వైరస్‌ను మట్టుబెట్టవచ్చన్నమాట.