Chameleon
-
అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి
అమెరికా: కొన్ని సంఘటనలు చాలా విచిత్రాతి విచిత్రంగానూ హాస్యస్పదంగా కూడా కనిపిస్తాయి. అలాంటి ఘటనే కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఒకతను తన ఇంట్లోకి వింతైన రంగురంగుల బల్లి ఒకటి వచ్చిందిని ప్లీజ్ కాపాడండి అంటూ పాము పట్టే వాళ్లకు ఫోన్ చేస్తాడు. ప్రతి రోజు మా ఇంట్లోకి పాము వచ్చిందంటూ రోజుకు మూడు నాలుగు కాల్స్ వస్తుంటాయి కానీ ఇలాంటి కాల్ రావడం మొదటిసారి అని బ్రూస్ ఐర్లాండ్ అంటున్నాడు. (చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్) పైగా ఆ వ్యక్తి అదోక బల్లిలా రకరకాల రంగుల్లో ఉంది ప్లీజ్ మీరు వచ్చి దాన్ని మా ఇంటి నుంచి తీసుకువెళ్లవలసిందింగా అభ్యర్థించాడు. దీంతో పాములు పట్టే నిపుణుడు బ్రూస్ ఐర్లాండ్ సదరు వ్యక్తి ఇంటికి వస్తాడు. బ్రూసి అతని ఇంట్లో ఒక ట్రైలో ఉన్న వింతైన బల్లిన చూసి ఇది అత్యంత ఆకర్షణియంగా ఉన్న రంగురంగుల ఊసరవెల్లిగా గుర్తిస్తాడు. ఇది ఏమి ప్రమాదకరమైన సరీసృపం కాదని చెబుతాడు. పైగా ఇది అత్యంత ఆకర్షణీయమైన రంగులతో ఉందని దానితో కాసేపు ఆడతాడు. అంతేకాదు బహుశా దీన్ని ఎవరో పెంచుకుంటన్నారని తప్పిపోయి ఉండోచ్చని సదరు వ్యక్తితో చెబుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అందమైన ఊసరవెల్లి అంటూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ అందమైన వీడియోని వీక్షించండి. (చదవండి: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల ముపై పెద్ద పాము) -
ఎంత బుల్లిగా ఉన్నావే.. ‘బ్రూకీసియా నానా’
ఈ ప్రపంచంలో అత్యంత చిన్నగా లేదా పెద్దగా ఉండే వస్తువులకైనా.. జీవులకైనా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కోవకు చెందిన అతి చిన్న ఊసరవెల్లిని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మడగాస్కర్‌లో అత్యంత తక్కువ పరిమాణంలో ఉన్న మగ ఊసరవెల్లి ఒకదానిని జర్మనీ, మలగాసేకు చెందిన పరిశోధనా బృందం కనుగొంది. చాలా చిన్నగా ఉన్న ఈ ఊసరవెల్లి ప్రపంచంలోని అతి చిన్న సరీసృపంగా గుర్తింపు పొందింది. ఊసరవెల్లి ముక్కు నుంచి చివరి వరకు అర అంగుళం (13.5 ఎంఎం) మాత్రమే ఉంది. ఇది మన వేలి కొనమీద నిలబడితే చిన్న బొమ్మలా కనిపిస్తుంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఊసరవెల్లికి ‘బ్రూకీసియా నానా’గా నామకరణం చేశారు. తోకతో కలిపి కొలిస్తే ఈ ఊసరవెల్లి కేవలం 22 ఎంఎం(మిలీమీటర్లు) మాత్రమే ఉంది. అయితే ఈ జాతిలో ఆడ ఊసరవెల్లి తోకతో కలిపి కొలిస్తే 29 ఎంఎంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మైక్రో సిటీ స్కాన్స్, త్రీడైమెన్షనల్ ఎక్స్‌రేస్ సాయంతో ఆడ ఊసరవెల్లిలో రెండు గుడ్లు గుర్తించినట్లు వివరించారు. ఇప్పటిదాక గుర్తించిన 51 ఇతర రకాల ఊసరవెల్లులతో పోలిస్తే ఇదే అత్యంత చిన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. మడగాస్కర్ అరుదైన ప్రాణులకు ఆవాసమని, ఇప్పటిదాక ఈ ప్రాంతంలో 200కు పైగా జాతులను కనుగొన్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎంతో బుజ్జిగా ఉన్న ఈ బుల్లి ఊసరవెల్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. -
నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో
-
నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో
ఊసరవెల్లికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఊసరవెల్లి బిడ్డకు జన్మనిస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నేచర్ ఈజ్ స్కేరీ’ అనే ట్విటర్ ఖాతాలో విడుదలైన 30 సెకన్ల నిడివి గల ఈ వీడియో 2.7 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ఊసరవెల్లి గుడ్లు పెడుతుందని ఇన్ని రోజులు అనుకుంటున్నాను. అది పిల్లల్ని కంటుందా?.. అరే! అప్పుడే పుట్టిన ఊసరవెల్లి ఎలా నడుస్తోందో చూడండి. మనం నడవటానికి సంవత్సరం పడుతుంది.. ఊసరవెల్లులు సరీసృపాలు కదా గుడ్లు పెడతాయనుకున్నా’’ అంటూ కామెంట్లు చేయగా.. ( వైరల్ : ఈ బుడ్డోడు సామాన్యుడు కాదు ) ‘ఊసరవెల్లుల్లో కొన్ని గుడ్లు పెడతాయి. మరికొన్ని బిడ్డల్ని కంటాయి’ .. ‘ఊసరవెల్లులు గుడ్ల నుంచే పుడతాయి. కానీ, అవి గుడ్లను పెట్టవు. గుడ్ల ఇంక్యూబేషన్ సమయం తల్లి కడుపులోనే జరుగుతుంది. పొదిగిన వెంటనే, తల్లి కడుపులోంచి బయటపడతాయి. అందుకే ఊసరవెల్లులు పిల్లల్ని కంటున్నట్లుగా అనిపిస్తుంది’ అని వివరించారు. -
ఊసరవెల్లి కరోనా వైరస్
వాషింగ్టన్: శత్రువుల కంట పడకుండా ఉండేందుకు ఊసరవెల్లి తన రంగులు మార్చుకుంటుందని, పరిసరాల్లోకి ఒదిగిపోతుందని మనకు తెలుసు. కరోనా వైరస్ కూడా ఇంతే. ఇది మన రోగ నిరోధక వ్యవస్థ దృష్టిలో పడకుండా ఉండేందుకు ఎన్ఎస్పీ16 అనే ఎంజైమ్‌ను వాడుకుంటుందని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ద్వారా తెలిసింది. ఎన్ఎస్పీ16 ఎంజైమ్ ఉన్న వైరస్‌ను రోగనిరోధక వ్య వస్థ గుర్తించడం లేదని, అది కణంలో భాగంగానే భావించేందుకు ఆ ఎంజైమ్ ఉపయోగపడుతుం దని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా తెలిపారు. ఈ కొత్త విషయం కారణంగా ఆ ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ తన పని తాను చేసుకుపోయేలా చేయవచ్చు. అంటే.. పరిస్థితి చేయి దాటక ముందే వైరస్‌ను మట్టుబెట్టవచ్చన్నమాట. -
కరోనా: ఈ ఊసరవెల్లిని చూసి నేర్చుకోండి!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కరోనా లాక్డౌన్ కారణంగా జనాలు ఇళ్లకు పరిమితమై గోళ్లు గిల్లుకుంటున్నారు. కరోనా వైరస్‌కు మందు లేదు.. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాలతో మాత్రమే దాన్ని అరికట్టగలం అని మొత్తుకుని చెబుతున్నా.. కొంతమంది మాత్రం వ్యక్తిగత పరిశుభ్రతే గిట్టదన్నట్లుగా ప్రవర్తిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారు ఈ ఊసరవెల్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలావుంది. విచక్షణలేని జంతువయ్యుండి శుభ్రంగా చేతుల్ని?! కడుక్కుని మానవ జాతికి ఆదర్శంగా నిలుస్తోంది. ( లాక్డౌన్: తండ్రి చివరి చూపు దక్కినా చాలు ) వ్యక్తిగత పరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ ఊసరవెల్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. కానీ, వీడియోలోని మాటల్ని బట్టి అది కరోనా కాలానికి చెందిందేనని స్పష్టం అవుతోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, దాదాపు 65 వేల మంది మృత్యువాత పడ్డారు. ( ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు! ) -
ఊసరవెల్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలావుంది
-
సీఎం కన్నా ఊసరవెల్లి నయం
ఆళ్లగడ్డ: పూటకో మాట మార్చుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా ఊసరవెల్లి నయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు భయపడి సీఎం చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఆయన అసమర్థతతోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. దోచుకునేందుకే ప్యాకేజీ ఒప్పకున్నారని ఆరోపించారు. అదే ఏపీకి హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి చిత్తశుద్ధిని నిరుపించుకోవాలన్నారు. -
రోడ్డుపై ఊసరవెల్లి
ప్రమాదకరమైన ఊసరవెల్లి రోడ్డుపై కనిపించడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కప్పలబండ వద్ద ప్రధాన రోడ్డుపై ఊసరవెల్లి కనిపించింది. దాన్ని చంపడానికి కొందరు ప్రయత్నించగా పలు రంగులు మారుస్తూ పొదల్లోకి వెళ్లిపోయింది. -
రంగుల డాన్...
మురిపించెన్.. ఓ ఊసరవెల్లి చెట్టుపై నుంచి కిందకు దిగి ఠీవీగా లాన్లో నడుచుకుంటూ వెళ్తోంది.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు, స్థానికులు దాన్ని చూశారు. చూడముచ్చటగా ఉండటంతో దాంతో కాసేపు ఆడుకున్నారు. ఫొటోలు తీసుకున్నారు. అనంతరం దాన్ని ఓ డబ్బాలో బంధించారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌లోని కృష్ణకుంజ్ గార్డెన్లో చోటుచేసుకున్న ఈ దృశ్యాలు సాక్షి కెమెరాకు చిక్కాయి. ఫొటోలు: దశరధ్జ్రువా -
మనం రంగు మారొచ్చు!
ఊసరవెల్లి గురించి తెలుసుకదూ. చర్మం రంగులు మార్చగలగడం దాని ప్రత్యేకత. అలాగే సముద్రంలో నివసించే అనేక జీవులు ఇతర వేట జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు చర్మం రంగును మారుస్తుంటాయి. అవి ఉన్న ప్రదేశానికి అనుగుణంగా తమ రంగును మార్చుకుని వాటిని వేటాడే జీవులను బోల్తా కొట్టిస్తుంటాయి. ఆ జీవి రంగు అక్కడి ప్రదేశంలో కలిసిపోయి ఉండడంతో వేరే జీవులేవీ వాటిని గుర్తించలేవు. తద్వారా అవి రక్షణ పొందుతాయి. ఇలా చర్మం రంగులను మార్చగలిగే లక్షణం అనేక సముద్ర జీవులకు ఉంది. రంగులు మార్చే చర్మం వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భావించిన శాస్త్రవేత్తలు ఇలాంటి కృత్రిమ చర్మాన్ని రూపొందించారు. చర్మం రంగు ఎలా మారుతుంది.. ఆక్టోపస్, కొన్ని రకాల చేపలు, ఇతర సముద్ర జీవులు చర్మం రంగును మార్చుకోగలవు. ఆయా జీవుల్లో ఉండే హరితకాలు అనే కణజాలాల వల్ల చర్మం రంగు మారుతుంది. ఈ జీవుల చర్మంపై వర్ణద్రవ్య సంచులు ఉంటాయి. కణజాలం చుట్టూ ఉన్న కండరాలు వర్ణద్రవ్యం సాగేలా చేస్తాయి. అక్కడి పరిసరాలు ఏ రంగులో ఉంటే ఆ రంగుకు అనుగుణంగా ఈ వర్ణద్రవ్యంరంగు మారుతుంది. దీని వల్ల ఆయా జీవుల రంగు పరిసరాల్లో కలిసిపోతుంది. ఈ మార్పులను ఆధారంగా చేసుకుని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని రూపొందించారు. ఎలా రూపొందించారు: రంగులు మారే కృత్రిమ చర్మం రూపొందించేందుకు శాస్త్రవేత్తలు సున్నితమైన, సాగే గుణం ఉన్న కండరాలు కలిగిన చర్మం లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా అవసరమైన రూపం, రంగు, పరిమాణంలోకి మారగలదు. ఈ చర్మంలాంటి పదార్థంపై రంగులు గల మచ్చల్ని ఏర్పాటు చేశారు. ఈ పదార్థం పరిమాణం, ఆకారం మారినప్పుడు ఈ మచ్చలు కూడా వెంటనే మారిపోతాయి. ఎలక్ట్రానిక్ తరంగాలకు అనుగుణంగా ఈ మచ్చలు కావాల్సిన రంగులోకి మారిపోతాయి. మరో శాస్త్రవేత్తల బృందం కూడా ఇటీవల ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాన్నే తయారు చేసింది. ఈ పరికరంలో కాంతి, ఉష్ణోగ్రత సెన్సర్లు ఉంటాయి. అవి పరిసరాల్లోని రంగుకు అనుగుణంగా కాంతిని ప్రసరింపజేస్తాయి. పరిసరాల్లో ఏ రంగు ఉంటే ఆ రంగు కాంతిని ఇవి ప్రసరిస్తాయి. ఇలా రంగులు మార్చే చర్మంలాంటి ఉత్తత్తులు అందుబాటులోకి వస్తే సైన్యం, రక్షణ సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. -
ఎవరెస్ట్‌పై మన లెక్క తప్పు
లండన్: ప్రపంచంలోకెల్లా ఎతై్తనది ఎవరెస్ట్ పర్వతమని, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని, చంద్రుడికి ఆవలివైపు చీకటి ఉంటుందని, చంద్రుడి పైనుంచి చైనా వాల్ కనిపిస్తుందని, పొద్దు తిరిగుడు పూవు సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందని, ఊసరవెల్లి పరిసరాలకు అనుగుణంగా రంగులు మారుస్తుందని, గబ్బిలాలకు కళ్లుండవని....ఎవరు చెప్పినా నమ్మేస్తాం. కాదంటే కసురుకుంటాం. కానీ ఇవన్నీ మన భ్రమలని, మన ముందువాళ్లు చెబుతూ వచ్చిన మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల మనలోనూ ఇలాంటి అభిప్రాయాలు బలంగా నాటుకుపోయాయని ‘బిలీఫ్ ఇట్ ఆర్ నాట్’ కాలం కింద ‘రిప్లీస్ డాట్ కామ్’ వీటన్నింటిని శాస్త్రీయంగా విశ్లేషించింది. ఎవరెస్ట్ పర్వతం: ప్రపంచంలోకెల్లా ఎతై్తన పర్వతం ఎవరెస్ట్ అని అధికారికంగా ప్రపంచమే గుర్తించింది. అయితే సాంకేతికంగా పరిశీలిస్తే దానికన్నా అమెరికా హవాయి దీవిలోని మౌనా కియా పర్వతమే ఎతై్తనదని జియాలజిస్టులే నిరూపించారు. సముద్ర మట్టంతో పోలిస్తే ఎవరెస్ట్ పర్వతం 8,850 మీటర్లు ఉంటుంది. బేస్‌ను ప్రామాణికంగా తీసుకుంటే మౌనా కియా పర్వతం ఎత్తు 13,796 మీటర్లు. దీని బేస్ సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఊసరవెల్లి: ఉష్ణోగ్రత, కమ్యూనికేషన్, వెలుతురు, మూడ్స్ కారణంగానే ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. పరిసరాలతో సంబంధం లేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా : చంద్రుడి పైనుంచి చైనా గోడ కనిపించదని, భూమే తెల్లటి, నీలి రంగు మార్బుల్స్లా కనిపిస్తుందని అపోలో వ్యోమగాములు ధ్రువీకరించారు. చంద్రుడికి ఆవల చీకటి: చంద్రడుకి ఆవల చీకటి ఉండదు. భూమిలాగే అది తన అక్షంలో తిరుగుతుంది. భూమిలాగానే దానికి అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రిగా వుంటింది. సూర్యుడి చుట్టూ భూమి: సాంకేతికంగా ఆలోచిస్తే సూర్యుడి చుట్టూ భూమి తిరగదు. మొత్తం సౌర కుటుంబమే అంతరిక్ష ద్రవ్యరాశిలో తన అక్షంలో తిరుగుతుంది కనుక మనకు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. బైబిల్లో ఆపిల్: ఈడెన్ గార్డెన్లో నిషేధిత ఫలం ఆపిల్ అని బైబిల్ ఎక్కడా పేర్కొనలేదు. తినకూడదని హెచ్చరించిన ఫలం అని మాత్రమే ఉంటుంది. ఫలం అంటే ఫలం కాదని, మంచి చెడుల విశ్లేషణకు ప్రతీకగా మాత్రమే ఫలం అన్నారనే వాదనలు కూడా ఉన్నాయి. పొద్దు తిరుగుడు పూవు: సూర్య భ్రమణంబట్టి పొద్దు తిరుగుడు పూవు తిరగదు. మొగ్గ దశలో మాత్రమే అది సూర్యుడి వైపు నిలుస్తుంది. పూవు వికసించాక పొద్దుతో సంబంధం లేకుండా ఒకే దిక్కులో ఉంటుంది. గబ్బిలాలకు కళ్లు: గబ్బిలాలకు చిన్ని కళ్లు ఉంటాయి. చీకటిలో అవి ప్రకంపనల ఆధారంగా సంచరిస్తాయి కనుక వాటికి కళ్లు ఉండవని భావిస్తూ వచ్చారు. బుల్‌ఫైట్: ఎర్ర గుడ్డలను చూస్తే దున్నపోతులు రెచ్చిపోతాయన్నది కూడా అబద్ధం. ఎందుకంటే తెలుపు, నీలి రంగులు మినహా మిగతా రంగులను గుర్తించే శక్తి వాటికి లేవు. బుల్ ఫైట్ సందర్భంగా చుట్టూ జనంచేసే కోలాహలం, ఎదురుగా ఓ మనిషి రెచ్చగొడుతుండడం వల్ల అవి చిర్రెత్తుకొచ్చి అలా రెచ్చిపోయి ప్రవర్తిస్తాయట. టమోట: అంటే కూరగాయనుకుంటాం. కానీ ఇది పండు జాతికి చెందింది. మెదడు: మెదడులో మనం కేవలం పది శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తాం అని చెబుతారు చాలామంది. ఇది కూడా తప్పే. మెదడులోని అన్ని భాగాలను పనిచేయిస్తాం. అలా జరగకపోతే శరీరంలోని ఏదో భాగం పని చేయకుండా పోతుంది. మెదడును మనం ఎలా ఉపయోగిస్తామన్న అంశాన్నిబట్టి మనిషి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. -
కళాకారుడి అద్భుత సృష్టి!
సన్నని కొమ్మపై వయ్యారంగా నడుచుకుంటూ పోతున్న ఈ రంగురంగుల ఊసరవెల్లిని చూశారా ఎంత అందంగా ఉందో.. మీరూ ఇలాగే అనుకుంటే పొరబడినట్టే.. ఎందుకంటే అది నిజమైన ఊసరవెల్లి కాదు. జాగ్రత్తగా పరిశీలించండి అందులో ఇద్దరు మోడళ్లు కన్పిస్తున్నారు కదూ..! ఇదంతా బాడీ పెయింటింగ్ మహిమ. ఇటలీకి చెందిన జొహెన్నెస్ స్టోటర్ అనే కళాకారుడు ఈ అద్భుతాన్ని సృష్టించాడు. దీన్ని రూపొందించేందుకు అతను 6 గంటల సేపు కష్టపడ్డాడట. -
చంద్రబాబువి హైలెవెల్ డ్రామాలు: వాసిరెడ్డి పద్మ
రాష్ట్ర విభజనపై ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయడం ద్వారా కొత్త డ్రామాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెరతీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రకటన చేసి 10 రోజుల తర్వాత బాబు స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రధానికి లేఖ రాసి చంద్రబాబునాయుడు అప్పుడే మెలకువ వచ్చిన వ్యక్తిలా వ్యవహారిస్తున్నారని ఆమె ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలకు భయపడి చంద్రబాబు ఆ లేఖ రాశారన్నారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్ ట్వంటీ-20 కాదు... డివిజన్ 420 అని ఆమె అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజల్లో బాబు ఓ విరోధిలా మారిపోయారని ఆమె పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటన కంటే ముందే చంద్రబాబుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటవుతుందన్న విషయం తెలుసని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఓ విధంగా వెన్నుపోటు పోడిచారన్నారు. తెలంగాణపై క్రెడిట్ పొందటంలో భాగంగానే చంద్రబాబు పలుమార్లు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని పద్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీట్లు, ఓట్లు కోసమే ప్రణబ్ కమిటీకి గతంలో బాబు తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చారన్నారు. ఆ లేఖను ఆమె ఓ బ్లాంక్ చెక్కుగా ఆభివర్ణించారు.