
శుభ్రంగా చేతులు కడుక్కుంటున్న ఊసరవెల్లి
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా జనాలు ఇళ్లకు పరిమితమై గోళ్లు గిల్లుకుంటున్నారు. కరోనా వైరస్‌కు మందు లేదు.. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరాలతో మాత్రమే దాన్ని అరికట్టగలం అని మొత్తుకుని చెబుతున్నా.. కొంతమంది మాత్రం వ్యక్తిగత పరిశుభ్రతే గిట్టదన్నట్లుగా ప్రవర్తిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారు ఈ ఊసరవెల్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలావుంది. విచక్షణలేని జంతువయ్యుండి శుభ్రంగా చేతుల్ని?! కడుక్కుని మానవ జాతికి ఆదర్శంగా నిలుస్తోంది. ( లాక్‌డౌన్: తండ్రి చివరి చూపు దక్కినా చాలు )
వ్యక్తిగత పరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ ఊసరవెల్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. కానీ, వీడియోలోని మాటల్ని బట్టి అది కరోనా కాలానికి చెందిందేనని స్పష్టం అవుతోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, దాదాపు 65 వేల మంది మృత్యువాత పడ్డారు. ( ఎంత నమ్మకం ఉంటే ఇలా చేస్తారు! )
Comments
Please login to add a commentAdd a comment