
అమెరికా: కొన్ని సంఘటనలు చాలా విచిత్రాతి విచిత్రంగానూ హాస్యస్పదంగా కూడా కనిపిస్తాయి. అలాంటి ఘటనే కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఒకతను తన ఇంట్లోకి వింతైన రంగురంగుల బల్లి ఒకటి వచ్చిందిని ప్లీజ్ కాపాడండి అంటూ పాము పట్టే వాళ్లకు ఫోన్ చేస్తాడు. ప్రతి రోజు మా ఇంట్లోకి పాము వచ్చిందంటూ రోజుకు మూడు నాలుగు కాల్స్ వస్తుంటాయి కానీ ఇలాంటి కాల్ రావడం మొదటిసారి అని బ్రూస్ ఐర్లాండ్ అంటున్నాడు.
(చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్)
పైగా ఆ వ్యక్తి అదోక బల్లిలా రకరకాల రంగుల్లో ఉంది ప్లీజ్ మీరు వచ్చి దాన్ని మా ఇంటి నుంచి తీసుకువెళ్లవలసిందింగా అభ్యర్థించాడు. దీంతో పాములు పట్టే నిపుణుడు బ్రూస్ ఐర్లాండ్ సదరు వ్యక్తి ఇంటికి వస్తాడు. బ్రూసి అతని ఇంట్లో ఒక ట్రైలో ఉన్న వింతైన బల్లిన చూసి ఇది అత్యంత ఆకర్షణియంగా ఉన్న రంగురంగుల ఊసరవెల్లిగా గుర్తిస్తాడు. ఇది ఏమి ప్రమాదకరమైన సరీసృపం కాదని చెబుతాడు.
పైగా ఇది అత్యంత ఆకర్షణీయమైన రంగులతో ఉందని దానితో కాసేపు ఆడతాడు. అంతేకాదు బహుశా దీన్ని ఎవరో పెంచుకుంటన్నారని తప్పిపోయి ఉండోచ్చని సదరు వ్యక్తితో చెబుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అందమైన ఊసరవెల్లి అంటూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ అందమైన వీడియోని వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment