ఊసరవెల్లికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఊసరవెల్లి బిడ్డకు జన్మనిస్తున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నేచర్ ఈజ్ స్కేరీ’ అనే ట్విటర్ ఖాతాలో విడుదలైన 30 సెకన్ల నిడివి గల ఈ వీడియో 2.7 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ఊసరవెల్లి గుడ్లు పెడుతుందని ఇన్ని రోజులు అనుకుంటున్నాను. అది పిల్లల్ని కంటుందా?.. అరే! అప్పుడే పుట్టిన ఊసరవెల్లి ఎలా నడుస్తోందో చూడండి. మనం నడవటానికి సంవత్సరం పడుతుంది.. ఊసరవెల్లులు సరీసృపాలు కదా గుడ్లు పెడతాయనుకున్నా’’ అంటూ కామెంట్లు చేయగా.. ( వైరల్ : ఈ బుడ్డోడు సామాన్యుడు కాదు )
‘ఊసరవెల్లుల్లో కొన్ని గుడ్లు పెడతాయి. మరికొన్ని బిడ్డల్ని కంటాయి’ .. ‘ఊసరవెల్లులు గుడ్ల నుంచే పుడతాయి. కానీ, అవి గుడ్లను పెట్టవు. గుడ్ల ఇంక్యూబేషన్ సమయం తల్లి కడుపులోనే జరుగుతుంది. పొదిగిన వెంటనే, తల్లి కడుపులోంచి బయటపడతాయి. అందుకే ఊసరవెల్లులు పిల్లల్ని కంటున్నట్లుగా అనిపిస్తుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment