సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వరుణగండం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలో అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అదే జరిగితే.. వరుణుడి ప్రతాపం నడుమ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల కోసం బుధ, గురువారాలను విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఈసీ సూచనతో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది కార్మికశాఖ.
ఇదీ చదవండి: ఆగం కావొద్దు.. జాగ్రత్తగా ఓటెయ్యాలె!
Comments
Please login to add a commentAdd a comment