
కరోనా వైరస్ ఎకానమీపై ప్రభావం చూపుతుందనే భయాలతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.
ముంబై : అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావంపై ఇన్వెస్టర్ల ఆందోళనతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మదుపుదారులు అమ్మకాలకు దిగడంతో మెటల్, ఆటోమొబైల్ సహా కీలక సూచీలు పతనమయ్యాయి. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోతుండగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 235 పాయింట్ల నష్టంతో 40,906 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 69 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,029 పాయింట్ల వద్ద క్లోజయింది.