
స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌కు ఏమైంది? ఆమె ముఖం ఏంటి ఇలా అయిపోయింది? అంటూ ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. రీసెంట్‌గా శృతి షేర్ చేసిన ఫోటోలే ఈ అనుమానాలకు కారణం. సాధారణంగా హీరోయిన్స్ డీగ్లామర్‌గా కనిపించేందుకు వెనకాడుతుంటారు. మేకప్ లేకుండా ఫోటోలు షేర్ చేసేందుకు కూడా ఇష్టపడరు. అయితే శ్రుతిహాసన్ మాత్రం ఇవేం పట్టించుకోదు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలే ఇందుకు నిదర్శనం.
ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫీవర్, సైనస్‌తో ఆమె బాధపడుతుందట. బ్యాడ్ డే, బ్యాడ్‌హెయిర్‌తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు, ఇష్టపడతారని భావిస్తున్నాను అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో శ్రుతిహాసన్ ముఖం బాగా ఉబ్బిపోయి బాగా డల్‌గా కనిపిస్తుంది. దీంతో అసలు శ్రుతిహాసన్‌కు ఏమైంది? ఇలా తయారయ్యిందేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలా షేర్ చేయడానికి చాలా గట్స్ ఉండాలంటూ మరికొందరు శ్రుతిని ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment