
ఈ కోవిడ్ సంక్షోభంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. కోవిడ్ బాధితులకు, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మన మంచి మాటలతో ధైర్యాన్ని నింపడం కూడా సాయమే అవుతుందంటున్నారామె. ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్‌డౌన్ అప్పుడు ఇంట్లోనే ఉండి వంటలు, వ్యాయామాలు, ఆన్‌లైన్ క్లాసులతో రోజులను గడిపాం. కానీ ఇప్పటి కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులు వేరు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఫీలై ఒకొరికొకరం సాయం చేసుకోవాల్సిన తరుణం ఇది’’ అని శ్రుతీహాసన్ అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సమయంలో కొంతమందికి సోషల్ మీడియా ఓ మంచి సాధనంగా ఉపయోగపడుతోంది. కోవిడ్ సహాయ సమాచారాలను తెలుసుకోగలుగుతున్నాం. అయితే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు. నా వరకు కచ్చితమైన వివరాలనే షేర్ చేయడానికే ప్రయత్నిస్తాను. నా టీమ్ గ్రౌండ్ లెవల్లో కొంత వర్క్ చేసిన తర్వాతనే నా టైమ్‌లైన్‌లో సమాచారాన్ని షేర్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ – ‘‘లాక్‌డౌన్‌కు ముందే ఓ హిందీ ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘సలార్’ చేయాల్సి ఉంది. కమిటైన మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో మరికొన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్.
Comments
Please login to add a commentAdd a comment