పిల్లలు ఎదిగేంతవరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వాళ్లు జీవితాల్లో స్థిరపడ్డాక ఇంకా ఈ బరువు బాధ్యతలు ఎందుకు... ప్రశాంతంగా వారి వద్ద గడిపేద్దాంలే అని ఉన్న ఆస్తులను వారికే పంచేస్తారు.కానీ, ఆస్తులను పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తులను తీసుకొని, ఇంటినుంచి గెంటేస్తే.. ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో తరచూ వృద్ధులకు సంబంధించి వచ్చిన వార్తల్లో ఇది ప్రధాన అంశంగా ఉంటోంది. వృద్ధుల ఆస్తులకు సంబంధించి రక్షణ చట్టాలు ఏం చెబుతున్నాయో... తెలుసుకుందాం.
మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామంలోని జెండా బజారుకు చెందిన వృద్ధురాలు నర్సమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వీరికి ముగ్గురు కుమారులు. ఉన్న మూడెకరాల భూమిని కొడుకులు పంచుకున్నారు. ఆ తర్వాత ఇంటిని కూలగొట్టి తల్లికి గూడు లేకుండా చేశారు. ఆస్తి పంచుకునే ముందు కొడుకులు నెలకు ఒకరి చొప్పున అమ్మను సాకుతామని ఒప్పందం చేసుకున్నారు. తీరా ఆస్తి పంచిన తర్వాత అసలు అమ్మ విషయాన్నే గాలికి వదిలేశారు. దాంతో చేసేదేం లేక తెలిసిన వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతూ వారిలో దయగల తల్లి ఎవరైనా ఇంత ముద్ద పెడితే తిని, ఎవరో ఒకళ్ల ఇంటి అరుగులపై తలదాచుకోవలసి వస్తోందా వృద్ధురాలు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్, ఆస్తిని తీసుకుని తల్లిని వదిలేసిన కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని ΄ోషించాలని, లేదంటే ఆమె పంచి ఇచ్చిన యావదాస్తిని తిరిగి తల్లికి చెందేటట్లుగా చేస్తామని వారిని హెచ్చరించారు.
సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007లోని (సీనియర్ సిటిజన్స్ యాక్ట్) సెక్షన్ 23(1) తల్లిదండ్రుల ఆస్తిని రక్షిస్తుంది. మోసాన్ని నిరోధించి, ్రపాథమిక సౌకర్యాలను కోల్పోకుండా పరి రక్షిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చి 15 సంవత్సరాలు గడిచినా ఈ హక్కులపై సీనియర్ సిటిజన్స్‌కు అవగాహన అంతంత మాత్రమే. సీనియర్లు తమ ఆస్తిని పంచి ఇచ్చిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే ట్రిబ్యునల్ ద్వారా ఆస్తి బదిలీని రద్దు చేసుకునే ఆవకాశంఉంది.
ఆస్తిని తిరిగి ΄పోందవచ్చు...
తమ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలని ఆలోచించే వయోవృద్ధులైన తల్లిదండ్రులు ట్రాన్స్‌ఫర్ డీడ్‌లో ఒక ఎక్స్‌ప్రెస్ షరతును చేర్చవచ్చు. ఆస్తిని బహుమతిగా తీసుకున్న పిల్లలు ఈ షరతును ఉల్లంఘిస్తే, ఆ బహుమతి చెల్లుబాటు కానిదిగా ప్రకటించి, తల్లిదండ్రులు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. తల్లిదండ్రులు ప్రేమ, ఆ΄్యాయతతో లేదా సేవలకు బదులుగా పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని సూచించవచ్చు. అయితే, అస్పష్టతకు తావు లేకుండా ఎక్స్‌ప్రెస్ షరతును చేర్చడం ఉత్తమం అని పేర్కొన్నాయి.
ఇంటినుంచి తరిమివేయవచ్చు
సీనియర్ సిటిజన్ల ఆస్తుల నుంచి పిల్లలు లేదా ఆస్తి తీసుకున్న బంధువులను తొలగించడానికి సుప్రీం కోర్టుతో సహా కోర్టులు అనుమతించాయి. చట్టబద్ధమైన వారసులమనే కారణంతో తల్లిదండ్రులను వేధిస్తే ఇంటినుంచి బయటకు పంపివేయవచ్చని కూడా ఆదేశించింది.
ముఖ్యమైన గమనికలు
⇒ ఆస్తిలో ఆర్థిక పెట్టుబడులు, కాపీరైట్‌లు, పేటెంట్లు, ఆభరణాలు, కళాఖండాలు మొదలైనవి ఉండచ్చు. ∙ఆస్తుల వివరాలతో΄ాటు బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలు, ఎమ్‌ఎఫ్‌లు, షేర్లు, ఎఫ్డీలు, బీమా పాలసీలు, లోన్లు.. మొదలైన వాటి జాబితా కోసం న్యాయవాది, ఆర్థిక సలహాదారుని సంప్రదింపు అవసరం. అందుకని వారి వివరాలను తీసుకోండి. వారసత్వం, ఆస్తుల ప్రణాళికలో కీలకమైన భాగం వీలునామాను రూపోందించడం. దాని చెల్లుబాటును నిర్ధారించడానికి కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి... ఆస్తులకు సంబంధించిన వివరాలు, కంపైల్ చేయాల్సిన సమాచారంలో ఇద్దరు సాక్షులను, ఒక ఎగ్జిక్యూటార్‌ని నియమించుకోవాలి.
⇒వీలునామాలో మీ తదనంతరం ఆస్తి ఎవరికి చెందాలో వారి పేర్లను విధిగా నమోదు చేయాలి. లేకుంటే తర్వాత వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.
అవగాహన అవసరం
వృద్ధుల రక్షణ చట్టం గురించి అవగాహన మన దేశంలో చాలా మందికి లేదు. అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వృద్ధులు కూడా తమ సమస్యను చట్టం దృష్టికి తేవాలి. ఆస్తులు లేక΄ోయినా వృద్ధ తల్లిదండ్రులు మెయింటనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
– ఎ.పి.సురేష్, సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్
Comments
Please login to add a commentAdd a comment