సాక్షి, వరంగల్: ముందస్తు శాసనసభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు సెంటిమెంట్ ప్రకారం తమ ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కరోజే 30 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాటితోపాటు తమ, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న స్థిర, చర ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను అఫిడెవిట్లలో వెల్ల్లడించారు.
అరూరి రమేష్ (వర్ధన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి)
ఆస్తుల విలువ రూ.12.98కోట్లు
సతీమణి కవిత ఆస్తుల విలువ : రూ.13.72కోట్ల
వర్ధన్నపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ స్థిర, చర ఆస్తుల విలువ రూ.12,98,06,820, సతీమణి పేర రూ.13,72,41,879, కుమారుడు విశాల్ పేర రూ.3,79కోట్లు, కూతురు అక్షిత పేరు మీద రూ. 2.5కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడెవిడ్‌లో ప్రకటించారు. రుణాలు రమేష్ పేరుమీద రూ.22,53,359, కవిత పేరు మీద రూ.1.93కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
‘అరూరి’ వాహనం లేదు
అరూరి రమేష్ అఫిడెవిట్‌లో తెలిపిన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాల్లో ఆయన పేరుతో వాహనం లేదు. ఆయన కుటుంబానికి కొడుకు విశాపేరుతో ఒక ఇన్నోవా వాహనం మాత్రమే ఉన్నట్లు చూపించారు.
వినయ్‌భాస్కర్ (పశ్చిమ టీఆర్‌ఎస్ అభ్యర్థి)
ఆస్తుల విలువ : రూ.3,29,88,117
నగదు : రూ.1.50లక్షలు
బ్యాంక్ నిల్వలు..
వినయ్‌భాస్కర్ : ఎస్‌బీఐ వడ్డేపల్లి బ్రాంచ్ : రూ.58,443
ఐఓబీ నక్కలగుట్ట : రూ.93,378
ఎస్‌బీఐ సెక్రటేరియట్ బ్రాంచ్ : 1,34,290
గ్రాయత్రి కోఆపరేటివ్ సొసైటీ : రూ.1లక్ష, రూ.5లక్షల
ఎల్‌ఐసీ బాండ్లు, ఒక ఇన్నోవా వాహనం : విలువ రూ.6లక్షలు
కేసులు..
వినయ్‌భాస్కర్‌పై కాజీపేటలో రెండు, హైదరాబాద్‌లో రెండు, రైల్వే కేసులు రెండు ఉన్నాయి.
అప్పులు..
హన్మకొండ కేవీబీలో రూ.67లక్షలు ఇంటిరుణం
భార్య రేవతి ఆస్తుల విలువ : రూ.74,86,880
నల్లకుంట కరూర్ వైశ్యాబ్యాంక్ : రూ.2,86,880
వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఒక వాహనం విలువ: రూ.6లక్షలు 104 తులాల బంగారం విలువ : రూ.35లక్షలు.
స్థిరాస్తులు..
వడ్డేపల్లి, మడికొండ, హన్మకొండలో ఇంటిస్థలాల విలువ కూ.2కోట్లు.
హకీంపేటలో రూ.1.06కోట్ల విలువైన అపార్ట్ మెంట్.
ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి)
ఆస్తుల విలువ : రూ.24.72 కోట్లు
జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన ఆస్తుల విలువ రూ.24,72,63,230 ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన సతీమణి ముత్తిరెడ్డి పద్మలతారెడ్డి పేరిట రూ.9.46.51.670 ఆస్తులు ఉన్నట్లు అఫిడెవిట్‌లో తెలిపారు. బ్యాంకుల ద్వారా యాదగిరిరెడ్డి తీసుకున్న అప్పులు రూ.1,32,42,670, భార్య పేరిట రూ.1,79,86,690 ఉన్నట్లు అఫిడెవిట్‌లో పేర్కొన్నారు.
యాదగిరెడ్డి చర ఆస్తుల విలువ : రూ.14,36,19,352
పద్మలతారెడ్డి : రూ.3,28,25,312
యాదగిరిరెడ్డి స్థిర ఆస్తులు : రూ.24,72,63,230
పద్మలతారెడ్డి :రూ.4,46,51,678
యాదగిరిరెడ్డి స్వీయ కొనుగోళ్ల ఆస్తులు :రూ.1,15,74,056
పద్మలతారెడ్డి : రూ.35,66,787
యాదగిరిరెడ్డి సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తులు : రూ.2,32,12,500
పద్మలతారెడ్డి : 1,79,87,500
యాదగిరిరెడ్డి బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం : రూ.1,32,42,670
పద్మలతారెడ్డి : రూ.1,79,86,690
సిరికొండ మధుసూదనాచారి (భూపాలపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి)
మధుసూదనాచారి ఆస్తుల విలువ : రూ.20,02,610
సతీమణి ఉమాదేవి ఆస్తుల విలువ : రూ.4,89,485
చేతిలో ఉన్న డబ్బు..
మధుసూదనాచారి : రూ.40 వేలు
ఉమాదేవి : రూ.15 వేలు
సేవింగ్, పాలసీలు, డిపాజిట్లు..
మధుసూదనాచారి : రూ.17,49,391
ఉమాదేవి : రూ.1,92,787
ఉమాదేవి పేరుపై ఉన్న వాహనం విలువ రూ.10.70 లక్షలు
బంగారు నగల విలువ..
మధుసూదనాచారి : 20 గ్రాములు : రూ.60 వేలు
ఉమాదేవి : 100 గ్రాములు : రూ. 3లక్షలు
ఉమ్మడి వ్యవసాయ భూమి..
మధుసూదనాచారి పేరుతో 3.16 ఎకరాలు : విలువ రూ.3.74 లక్షలు
ఉమాదేవి పేరుతో అర ఎకరం : విలువ రూ.2.50 లక్షలు
నివాస భవనాలు..
నర్సక్కపల్లిలోని నివాస భవనం. ప్రస్తుత విలువ రూ.9 లక్షలు
మధుసూదనాచారి తీసుకున్న బ్యాంకు రుణం రూ.7,49,566
చల్లా ధర్మారెడ్డి (పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి)
ఆస్తుల విలువ : రూ.27కోట్లు
రుణాలు రూ.3.89కోట్లు
పరకాల టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పేరు మీద ఉన్న స్థిర, చర ఆస్తుల విలువ రూ.27,19,69,314. ఇందులో హిందు అవిభక్త కుటుంబం ఆస్తి విలువ రూ.3,23,47,366. ధర్మారెడ్డి సతీమణి జ్యోతి పేరు మీద రూ.10,15,33,846 విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ధర్మారెడ్డి పేరు మీద బ్యాంక్ రుణాలు రూ.3,89,00,063, సతీమణి జ్యోతి పేరు మీద రూ.1,50,24,764 ఉన్నాయని తెలిపారు.
గండ్ర సత్యనారాయణరావు (ఏఐఎఫ్‌బీ అభ్యర్థి)
గండ్ర సత్యనారాయణరావు ఆస్తుల విలువ : రూ.6,11,360
సతీమణి గండ్ర పద్మ ఆస్తుల విలువ : రూ.3,83,950
చేతిలో ఉన్న నగదు..
సత్యనారాయణరావు : రూ.60 వేలు
గండ్ర పద్మ : రూ. 40 వేలు
చరాస్తుల విలువ..
గండ్ర సత్యనారాయణరావు :రూ.23,53,800
గండ్ర పద్మ : రూ.5,90,000
గండ్ర అనూష : రూ.1.90 లక్షలు
స్థిరాస్థుల విలువ..
సత్యనారాయణరావు : రూ.1.71 కోట్లు
పద్మ : రూ.1.60 కోట్లు
సంపాదనతో కొన్న ఆస్తుల విలువ..
సత్యనారాయణరావు : రూ.16.69 లక్షలు
గండ్ర పద్మ : రూ.36,43,500
చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి)
కీర్తిరెడ్డి ఆస్తుల విలువ : రూ.12,81,372
భర్త సత్యపాల్‌రెడ్డి : రూ.33,26,391
కీర్తిరెడ్డి చేతిలో ఉన్న డబ్బు : రూ.45 వేలు
సత్యపాల్‌రెడ్డి : రూ.50 వేలు
బ్యాంకుల్లో నిల్వ..
కీర్తిరెడ్డి : రూ.4,54,426
సత్యపాల్‌రెడ్డి : రూ.17,38,911
సేవింగ్స్, పాలసీలు..
కీర్తిరెడ్డి : రూ.19,63,176
సత్యపాల్‌రెడ్డి : రూ.58,41,968
రుణాలు, చిట్టీలు..
కీర్తిరెడ్డి : రూ.1,32,000
సత్యపాల్‌రెడ్డి : రూ.50,62,050
వాహనాల విలువ..
కీర్తిరెడ్డి : రూ.23,490
సత్యపాల్‌రెడ్డి : రూ.10,64,809
బంగారు నగల విలువ..
కీర్తిరెడ్డి : రూ.32.06 లక్షలు
సత్యపాల్‌రెడ్డి : రూ. 3,83,640
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు..
కీర్తిరెడ్డి : రూ.5.38 కోట్లు(ప్రస్తుత విలువ)
సత్యపాల్‌రెడ్డి : రూ. 5.56 కోట్లు(ప్రస్తుత విలువ)
రుణాలు, అప్పులు..
కీర్తిరెడ్డి : రూ.97,42,457
సత్యపాల్‌రెడ్డి : రూ.3.70 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment