- చిన్న మొత్తాలు చెల్లింపునకు ప్రాధాన్యం
- సీఐడీ అడిషనల్ డీఐజీ ద్వారకా తిరుమలరావు వెల్లడి
20 నుంచి అగ్రి, అక్షయగోల్డ్ ఆస్తుల వేలం
Published Wed, Jun 14 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
సాక్షి, రాజమహేంద్రవరం:
హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి అగ్రిగోల్డ్, అక్షయ గోల్డ్ ఆస్తులను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు సీఐడీ అడిషనల్ డీఐజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సీఐడీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 27 అర్ధరాత్రి 12 గంటల వరకు అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన ఆస్తులు, 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అక్షయగోల్డ్ ఆస్తులను ఈ–వేలం వేయనున్నట్లు తిరుమలరావు చెప్పారు. ఆస్తులను పరిశీలించుకునేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమయం ఇచ్చినట్లు చెప్పారు. వేలం ముగిసిన పది రోజుల్లో పాటలో 25 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆస్తులను స్వాధీనం చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. రెండు సంస్థలకు సంబంధించి ఈ–వేలం వేసే ఆస్తుల వివరాలు, ఇతర సమాచారం జ్టి్టpట://జుౌnuజౌ u.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. చిన్న మొత్తం డిపాజిట్లను ముందుగా చెల్లిస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్‌లో 19 లక్షల మంది డిపాజిటర్లుండగా అందులో రూ.20 వేలులోపు డిపాజిటర్లు 10 లక్షలు, రూ. ఐదువేలులోపు డిపాజిటర్లు 3 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీరికి రూ.1180 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.
నిర్మాణంలో లోపాలు లేవు...
వర్షం వల్ల ఆసెంబ్లీలోని ప్రతిపక్ష నేత చాంబర్‌లోకి పైపు లైను ద్వారానే నీరు ప్రవహించిందని తిరుమలరావు తెలిపారు. నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని చెప్పారు. అక్కడ పని చేసిన వారిని కూడా పిలిచి విచారించామని చెప్పారు. నీరు ఎలా వచ్చిందన్న దానిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. పైపు కోశారా? లేక ఎండకు ధ్వంసమైందా? అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక నేరాల విభాగం ఐజీపీ అమిత్‌గార్గ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement