Potina Mahesh: పవన్‌ అక్రమాస్తుల వివరాలు ఇవే..! | Potina Mahesh Comments On The Details Of Pawan Kalyan's Illegal Assets, More Details Inside | Sakshi
Sakshi News home page

Potina Mahesh: పవన్‌ అక్రమాస్తుల వివరాలు ఇవే..!

Published Fri, May 10 2024 9:19 AM | Last Updated on Fri, May 10 2024 11:47 AM

Potina Mahesh Comments On The Details Of Pawan Kalyan's Illegal Assets

రాజకీయాల్లో పవన్‌ చీడ పురుగు

పార్టీ పెట్టిన పదేళ్లలో రూ.2,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించారు

తనను నమ్ముకున్న నేతలను బలిపశువుల్ని చేశారు

ఆయన ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే

పవన్‌ బినామీలపై ఈడీ, సీఐడీలు విచారణ చేపట్టాలి

వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ తీవ్ర ఆరోపణలు

విజయవాడ: రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్‌ పెద్ద చీడపురుగని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పోతిన మహేష్‌ తీవ్రస్థాయిలో ఆరోపించా­రు. జనసేన స్థాపించిన పదేళ్లలో ఆయన సు­మా­రు రూ.15 వందల కోట్ల నుంచి రూ.రెండు వేల కోట్ల వరకు అక్రమంగా సంపాదించారని ఆయ­న వెల్లడించారు. 2014లో కేవలం ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూ కారు ఈఎంఐ కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పిన పవన్‌ ఇప్పుడు లగ్జరీ కార్లు, విలాసవంతమైన ఇల్లు, తిరగటానికి హెలికాప్టర్, అనేక ఆస్తులను తొమ్మిదేళ్లలో ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

విజయవాడ­లో­ని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఇటీవల కాలంలో పవన్‌ ఏ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించకపోయినా.. రూ.వందల కోట్ల లాభాలు రాకపోయినా జనసేన పార్టీ పెట్టాకే పవన్‌కు రూ.వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీని నడపలేక తీసేశారుగానీ.. జనసేన పార్టీని మాత్రం ముందే చంద్రబాబుకి అమ్మేసి డబ్బులు తెచ్చుకున్న దుర్మార్గుడు పవన్‌.

మాలాంటి వాళ్లందర్నీ రాజకీయంగా, ఆరి్థకంగా బలిపశువులు చేసి ఆయన మాత్రం అన్ని రకాలుగా బాగుపడ్డారు. కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి, బీసీలను మార్పుకోసం పోరాడాలని సూచించి ఆయన మాత్రం చంద్రబాబుకు పాలేరు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, నేను చంద్రబాబు సేవకుణ్ణి, చంద్రబాబు పాలేరుని అంటూ ప్యాకేజీ తీసుకుని మాలాంటి వాళ్లను పవన్‌ బలి పశువులని చేసి ఆయన మాత్రం బాగా ఆరి్థకంగా బలపడ్డారు.

ఈ సమావేశంలో పవన్‌ ఆక్రమాస్తులు.. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన వాటి వివరాలను పోతిన మహేష్‌ వెల్లడించారు. అవి..

  • మంగళగిరి పార్టీ ఆఫీస్‌ పక్కన పవన్‌ బినామి అయినా నర్రా శ్రీనివాస్‌ మిత్రుడు పోషడుపు వెంకటేశ్వరరావు పేరు మీద రూ.100 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆధార్‌ కార్డుపై అనేక అనుమానాలున్నాయి. పోషడుపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. రెండు రిజి్రస్టేషన్లకి పోషడుపు వెంకటేశ్వరరావు హాజరుకాగా.. మరొక రెండు రిజి్రస్టేషన్లకు నర్రా శ్రీనివాస్‌ కారు డ్రైవర్‌ వి. నవీన్‌కుమార్‌ హాజరయ్యారు. డాక్యుమెంట్‌ నెంబర్లు : 704/2024, 2244/2024, 2818/2024, 3555/2024, 5002/2014.

  • రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో పవన్‌ ఫామ్‌హౌస్‌ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్‌లో చూపించారు. కానీ, అది 45–50 ఎకరాల్లో ఉంది. పాతది 14 ఎకరాలైతే.. 2019 ఎన్నికల తర్వాత పవన్‌ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం ఏడున్నర కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు.

  • 2019 ఎన్నికల్లో పవన్‌కు ఎన్‌ఆర్‌ఐలు, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు రూ.125 కోట్ల విరాళాలిచ్చారు. వాటిని వసూలుచేసింది పీవీ రావు, ఆర్‌ఆర్‌ రామ్మోహన్, చింతల పార్థసారధి, ముత్తంశెట్టి కృష్ణారావు. అందులో 90శాతం నగదు రూపంలో, పది శాతం డీడీల రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందునే వాళ్ల మధ్య వివాదాలు తలెత్తాయి.

  • పవన్‌ నిజస్వరూపం తెలియాలంటే 2018–­2024 వరకు చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తప్ప పవన్‌ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలన్నీ బయటపెట్టాలి.

  • పవన్‌ హైదరాబాదులో కొనుగోలు చేసిన 4,200 గజాల విలువ రూ.50 కోట్లుగా చూపించారు. దానిని 2021–2024 మధ్యే కొనుగోలు చేశారు. నిజానికి.. దాని విలువ సుమారు 125 కోట్లుగా ఉంది. మిగిలిన రూ.75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి.

  • పవన్‌ బ్యాంకుల్లో ఫిక్స్‌ డిపాజిట్ల కింద రూ.28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ, బయట వ్యక్తుల దగ్గర రూ.46 కోట్ల అప్పులను కూడా చూపించారు. బ్యాంకులో రూ.28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా?

  • సినీ పరిశ్రమలోను, బయట పవన్‌ బినామీలున్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, పీపుల్స్‌ మీడియా ప్రొడ్యూసర్‌ టీజీ విశ్వప్రసాద్‌. వీరితోపాటు అమెరికాలోని పవన్‌ పిన్ని కొడుకు అనిల్, అలాగే, తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్, తంగేళ్ల సుమన్‌ వీరంతా కూడా ఆయన బినామీలే.

  • ఇక పవన్‌ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్‌ మీద స్వా«దీనం చేసుకున్నారు. వాటినింకా రిజి్రస్టేషన్‌ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్సుల కింద తీసుకున్నట్లు చూపించి ఆపై రిజిస్ట్రేషన్‌ చేయించుకోనున్నారు. అలాగే, హైదరాబాద్‌లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనుక నాలుగు నెలలు కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది.

  • టీ టైమ్‌ తంగెళ్ల శ్రీనివాస్‌కు 2,500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్‌ తన బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చుకునేందుకు ఈ దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు.

  • పవన్‌ తన పిల్లల పేర్లు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రద్దుచేశానని చెప్పారుగానీ ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తానివి రద్దుచేసి ఏ ఆస్తి కొన్నారో చెప్పాలి.

  • జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్‌ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజి్రస్టేషన్‌ చేయించడంలేదు?

  • ప్యాకేజ్‌ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకే పవన్‌ విరాళాల ముసుగులో అమెరికా వెళ్తున్నారు.

  • త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కొనుగోలు చేయడానికి పవన్‌ యత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్‌ ద్వా­రా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.

  • పవన్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్‌ అయినా, డబ్బులు రాకపోయినా నిర్మాత విశ్వప్రసాద్‌ పవన్‌తో ఏడు సినిమాలు తీస్తానని చెప్తున్నారు. ఈ చిదంబర రహస్యం ఏంటి?

  • పవన్‌ ప్రధాన బినామి టీజీ విశ్వప్రసాద్‌పై సీబీఐ విచారణ చేయాలి. ఈడీ, సీఐడీలు కేసులు నమోదు చేయాలి. రేణుదేశాయ్‌కు ప్రతినెలా రూ.10 లక్షలు టీజీ విశ్వప్రసాద్‌ తీసుకెళ్లి ఇస్తున్నారు.

  • ప్యాకేజీకి అదనంగా పవన్‌కళ్యాణ్‌ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 కోట్లు పవన్‌ వసూలుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement