
పంచాయతీ అధికారి ఇళ్లపై ఏసీబీ దాడులు
గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి ఇళ్లపై అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులు దాడులు చేశారు.
గుంటూరు: తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) గోరంట్ల వీరయ్య చౌదరి ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం మెరుపు దాడులు చేశారు.
గుంటూరు రాజేంద్రనగర్ రెండో లైన్‌లోని ఆయన నివాసంతోపాటు చీరాల, నరసరావుపేటల్లోని బంధవుల ఇళ్లపైనా ఏకకాలంలో దాడులకు దిగారు. ఈ సోదాల్లో గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న అపార్టుమెంట్‌లో ప్లాటు, చీరాలలో మూడిళ్లు, తుళ్లూరులో ఎకరం, వీరన్నపాలెంలో ఏడెకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వీటితోపాటు కిలో బంగారు ఆభరణాలు, లక్ష నగదు కూడా ఉన్నాయి. జల్ తుపాను పరిహారం, ఇసుక పర్మిట్లలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు డీపీవో గోరంట్ల వీరయ్య చౌదరిపై పలు ఆరోపణలు రావడంతో తాము సోదాలు చేసినట్లు గుంటూరు ఏసీబీ డీఎస్పీ దేవానంద తెలిపారు.