‘తలాక్’ ముస్లింల అంతర్గతం | talak is muslim community's pesonol problom : RSS | Sakshi
Sakshi News home page

‘తలాక్’ ముస్లింల అంతర్గతం

Published Wed, Oct 26 2016 2:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

‘తలాక్’ ముస్లింల అంతర్గతం

‘తలాక్’ ముస్లింల అంతర్గతం

నష్టాల తీవ్రతపై ముస్లిం సమాజమే విశ్లేషించుకోవాలి: ఆరెస్సెస్
దీనిపై మహిళలకు కోర్డులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం
అయోధ్యలో మందిరం కాక మరే కట్టడాన్నీ ఊహించలేం
ముగిసిన జాతీయ కార్యవర్గ సమావేశాలు

 సాక్షి, హైదరాబాద్: తలాక్ చెప్పటం ద్వారా విడాకులు తీసుకునే వ్యవహారం పూర్తిగా ముస్లింల అంతర్గత విషయమని ఆరెస్సెస్ స్పష్టంచేసింది. అయితే దాని ద్వారా ఎదురవుతున్న నష్టాల తీవ్రతపై ముస్లిం సమాజం విశ్లేషించుకోవాల్సిన అవసరమైతే ఉందని అభిప్రాయపడింది. ముస్లిం మహిళలే దానిపై కోర్టుకు వెళ్లారని.. వారు కోరుకుం టున్నట్టుగా న్యాయం జరుగుతుందని ఆశి స్తున్నట్టు పేర్కొంది. ఉమ్మడి పౌరస్మృతి విషయంలోనూ ఆచితూచి స్పందించింది.

అందరి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ వివక్ష లేని న్యాయవ్యవస్థ ఏర్పడాల ని ఆశిస్తున్నట్టు వెల్లడించింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని అన్నోజిగూడలో మూడ్రోజులుగా జరుగుతున్న ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగ ళవారంతో ముగిశాయి. ప్రపంచవ్యాప్త పరిణామాలు-భారత్‌పై ప్రభావం, దేశంలో రాజ కీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలు, ఉగ్రవాదం, హిందూత్వపై జరుగుతున్న దాడు లు తదితర అంశాలపై ఇందులో కూలంకషంగా చర్చించారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు బీజేపే నేతలు ఇందులో పాల్గొన్నారు. చివరి రోజున సమావేశాల సంక్షిప్త సమాచారాన్ని ఆరెస్సెస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి (సర్‌కార్యవాహ) భయ్యాజీ జోషీ మీడియా కు వివరించారు. ఈ సందర్భంగా తలాక్‌పై ప్రశ్నించగా.. దేశంలో లింగ వివక్షకు చోటుండకూడదన్నది ఆరెస్సెస్ సిద్ధాంతమని చెప్పారు. అది ముస్లింల అంతర్గత విషయమని చెప్పారు.

 రామ మందిరం నిర్మించాల్సిందే...
అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మూడు దశాబ్దాలుగా ఆరెస్సెస్ ఎదురుచూస్తోందని భయ్యాజీ చెప్పారు. ఆ స్థలంలో రామమందిరం తప్ప మరే నిర్మాణాన్ని ఊహించుకోలేమన్నారు. అలహాబాద్ కోర్టు తీర్పు తర్వాత మందిర నిర్మాణం జరగాలన్న విషయం స్పష్టమైనా... ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు కోసం అంతా వేచి చూడాలన్నారు. ఇటీవల చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ బాగా ఉన్నప్పటికీ ఆరెస్సెస్ మాత్రం అన్ని విదేశీ వస్తువుల విషయంలో ఇదే అభిప్రాయంతో ఉందన్నారు. గో సంరక్షణ నినాదాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. కళకు ఎల్లలు ఉండవన్న విషయంలో తమకు మరో అభిప్రాయం లేనప్పటికీ మన సినీ నిర్మాతలు పాకిస్తాన్ నటులపై ఆధారపడటం సరికాదన్నారు. మన దేశంపై ద్వేషం చిమ్ముతూ మన సినిమాల్లో నటించొద్దని పాక్ భావిస్తున్నప్పుడు మన నిర్మాతలు పాక్ నటుల కోసం ఎందుకు తపన పడాలని ప్రశ్నిం చారు. సర్జికల్ స్రైక్స్ విషయంలో ప్రభుత్వం, సైనికుల ధీరత్వాన్ని ఆరెస్సెస్ అభినందిస్తోందన్నారు.

మరిన్ని గ్రామాలకు ఆరెస్సెస్
ఆరెస్సెస్ మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుందని భయ్యాజీ తెలిపారు. ప్రస్తుతం 44వేల గ్రా మాల్లో 70వేల శాఖలతో కార్యకలాపాలు సాగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి ఈ సంఖ్య 75వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. వచ్చే సమావేశాలకు తమిళనాడు వేదికవుతుందని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆరెస్సెస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మన్‌మోహన్‌జీ వైద్య, సహ ప్రచార ప్రముఖ్ నందకుమార్ పాల్గొన్నారు.

హిందువులపై దాడులను అడ్డుకోవాలి
బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల్లో హిందువులు, మరీ ముఖ్యంగా ఆరెస్సెస్, హిందూ సంస్థల కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని భయ్యాజీ ఆందోళనవ్యక్తం చేశా రు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ దాడులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement