త్యాగం, విశ్వాసానికి ప్రతీక బక్రీద్‌ : సీఎం జగన్‌ | CM YS Jagan Mohan Reddy Greets Muslims On Bakrid | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

Published Fri, Jul 31 2020 12:02 PM | Last Updated on Fri, Jul 31 2020 12:55 PM

CM YS Jagan Mohan Reddy Greets Muslims On Bakrid - Sakshi

సాక్షి, అమరావతి : పవిత్రమైన బక్రీద్‌ పర్వదినాన్ని(ఆగస్టు 01) పురస్కరించుకొని ముస్లిం సోదరసోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అన్నారు.  దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. (చదవండి : ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా)

గవర్నర్ బక్రీద్ శుభాకాంక్షలు
ముస్లింలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘బక్రిద్ (ఇద్-ఉల్-జుహా) పవిత్ర దినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం మరియు పేదల పట్ల కరుణను సూచిస్తుంది. ఇతరుల పట్ల సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు దానధర్మాలు, సద్భావనలతో ఆచరిస్తారు’అని గవర్నర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement