Bakrids wishes
-
దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు (ఫొటోలు)
-
ముస్లిం సోదరులకు ఏ పీ సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
-
త్యాగం, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని(ఆగస్టు 01) పురస్కరించుకొని ముస్లిం సోదరసోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి ఈ పండుగ ప్రతీక అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్ ఇచ్చే సందేశమన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. (చదవండి : ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్లో ఆసరా) Greeting to my Muslim brothers & sisters on the occasion of Eid al-Adha. May this auspicious day further the spirit of compassion, devotion & faith amongst all of us.#EidAlAdha — YS Jagan Mohan Reddy (@ysjagan) July 31, 2020 గవర్నర్ బక్రీద్ శుభాకాంక్షలు ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బక్రిద్ (ఇద్-ఉల్-జుహా) పవిత్ర దినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బక్రిద్ పవిత్రమైన దినంగా ఇస్లామ్ మతంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగిన రోజు. ముస్లిం సోదరులు ఈ పండుగను సంపూర్ణ భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. బక్రిద్ పండుగ త్యాగనిరతి, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం మరియు పేదల పట్ల కరుణను సూచిస్తుంది. ఇతరుల పట్ల సోదర భావాన్ని తెలియచేస్తుంది. ఈ పవిత్రమైన రోజును ముస్లిం సోదరులు దానధర్మాలు, సద్భావనలతో ఆచరిస్తారు’అని గవర్నర్ పేర్కొన్నారు. -
బక్రీద్ శాంతి సుహృద్భావాలను పెంపొందించాలి
సాక్షి, గుడివాడ: త్యాగం, సహనానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం ప్రజలందరి మధ్య శాంతి సుహృద్భావాలను పెంపొందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈర్ష్య, అసూయా ద్వేషాలకు అతీతంగా త్యాగమయ సమాజ నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు. మానవత్వానికి, తాగ్యానికి పత్రీక: ముస్లిం సోదరులకి రవాణా,సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండగను మానవత్వానికి, త్యాగానికి పత్రీకగా పేర్కొన్నారు విజయవాడలో ఘనంగా బక్రీద్ వేడుకలు: ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆత్మీయ ఆలింగనాలతో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. ముస్లింలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని తెలిపారు. -
త్యాగానికి, దైవత్వానికి ప్రతీక: జగన్
ముస్లింలకు జగన్ బక్రీద్ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నమన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని జగన్ ఆకాంక్షించారు. -
ముస్లీంలకు జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లీంలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లీంలు చేసుకునే ఈ పండుగ భక్తి భావానికి చిహ్నం అని తెలిపారు.