సత్యనిష్ఠ, సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్‌ : వైఎస్‌ జగన్‌ | YS Jagan greets Muslims on Ramadan | Sakshi
Sakshi News home page

సత్యనిష్ఠ, సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్‌ : వైఎస్‌ జగన్‌

Jun 4 2019 9:29 PM | Updated on Jun 5 2019 10:08 AM

YS Jagan greets Muslims on Ramadan - Sakshi

సాక్షి, అమరావతి: రంజాన్‌ పర్వదినం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతుని స్మరణలో తరించే ఈ రంజాన్‌ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పవిత్ర ఖురాన్‌ గ్రంథం దివి నుంచి భువికి దిగివచ్చిన శుభ సమయం ‘రంజాన్‌’ అని తెలిపారు. నమాజ్, కలిమా, రోజా, జకాత్, హజ్‌ అనే ఐదు అంశాలతో భగవంతునికి కృతజ్ఞతలు తెలిపే ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆత్మీయ శుభాభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement