
సాక్షి, హైదరాబాద్, అమరావతి: రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ప్రజల్లో సుఖసంతోషాలను నింపుతుందని పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రంజాన్‌ను ఇళ్లలోనే జరుపుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment