సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జన్మదినాన్ని ఆనందం తో జరుపుకోవాల్సిన సందర్భమిదని, జీసస్ బోధనల అనుసారం కరుణ, ప్రేమకు పునరంకితం కావాలని తన సందేశంలో పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణను ప్రబోధించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తన సందేశంలో తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సాక్షి, అమరావతి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సాటి మను షుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, క్రైస్తవ సోదరులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు బోధనలు, సందేశాలు ఆచరణీయమైనవని, ప్రేమ, శాంతి సందేశాలు, ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఏసు సందేశాలను ఆచరించాలని, ఆయన ఆశయాలను పాటించడమే నిజమైన భక్తి అని చెప్పారు.
క్రిస్మస్ శుభాకాంక్షలు
Published Wed, Dec 25 2019 4:12 AM | Last Updated on Wed, Dec 25 2019 8:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment