Christmas wishes
-
క్రైస్తవులకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
-
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
వైఎస్సార్, సాక్షి: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని క్రెస్తవులందరికీ వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారాయన.‘‘కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు.... దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి’’ అని తన క్రిస్మస్(Christmas) సందేశంలో వైఎస్ జగన్(YS Jagan) పేర్కొన్నారు.ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ ఇడుపులపాయలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి -
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రేపు(సోమవారం) ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం జగన్.. ‘దైవ కుమారుడు జీసస్ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగగా జరుపుకుంటారు. ఏసుప్రభువు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమా, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ప్రేమ, దయతో మెలగాలని క్రిస్మస్ మనకు ప్రేరణనిస్తుందని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశ ప్రజలకు శనివారం ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం మానవాళి శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని రాష్ట్రపతి ఆ సందేశంలో తెలిపారు. ‘యేసుక్రీస్తు అందించిన కరుణ, త్యాగం అనే సందేశాన్ని ఈ రోజున మనం స్మరించుకుందాం. క్రిస్మస్ పండుగ ఒకరినొకరు ప్రేమ, దయతో మెలగడానికి స్ఫూర్తినిస్తుంది. క్రీస్తు యొక్క దైవిక బోధనలను మన జీవితంలో స్వీకరిద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆమె పేర్కొన్నారు. ‘దేశ ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు’ అని తెలిపారు. -
భారీగా బరువు తగ్గిన టాలీవుడ్ హీరో
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు వారబ్బాయి మనోజ్ విభిన్న కథాపరమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘దొంగ దొంగది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మనోజ్ 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరగా కనిపించాడు. కుటుంబ పరమైన సమస్యలతో ఇబ్బంది పడిన మనోజ్ తన భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మూడేళ్లపాటు సినిమాలకు, బయటి ప్రపంచానికి దూరంగా గడిపాడు. అయితే సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. చదవండి: రామ్ చరణ్‌తో కేక్ కట్.. అహం బ్రహ్మాస్మి సినిమానే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానున్న రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. ఇవి వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మంచు మనోజ్ భారీగా బరువు తగ్గి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఓ సినిమా కోసం మనోజ్ ఏకంగా 15 కిలోలు సన్నబడ్డారు. బరువు తగ్గాక దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశాడు. ట్విటర్లో న్యూ ప్రొఫైల్ పిక్‌గా పోస్టు చేశాడు. అలాగే ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ మరో ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. వీటిని బీఏ రాజు రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక ఒక్కసారిగా ఇలా సన్నగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే తన సినిమాలకు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. చదవండి: తేజ్, మనోజ్.. 'బిల్లా-రంగా'! Rocking star @HeroManoj1 looks dashing in this stunning makeover. Lost 15kgs weight for his next!! Already He has signed Two Telugu /Tamil bilingual films, planning for 2021 release. #ManojManchu #VaikunthaEkadashi#HAPPYCHRISTMAS 🎄 pic.twitter.com/2vDlZDkQY6 — BARaju (@baraju_SuperHit) December 25, 2020 -
మెగా ఫ్యామిలీ నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు..
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముందు రోజు అర్ధరాత్రి నుంచే ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు చర్చిలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. కొత్త సంవత్సరానికి ఆరు రోజుల ముందు వచ్చే ఈ పండుగ కోసం ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. క్రైస్తవులు మాత్రమే కాకుండా హిందువులు కూడా ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు అభిమనులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. ‘క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ మ్యాజిక్ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్వీట్ చేశారు. చదవండి: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు.. #MerryChristmas🎄to all! Hope the magic of Christmas fills joy and laughter in our lives.May the holiday season recharge us for a great year ahead! pic.twitter.com/BC10I1b3rf — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2020 టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఉల్లాసాన్ని పంచండి. ఇవ్వడానికి, పంచుకునేందుకు ఇది అందమైన రోజు. అందరికి ప్రశాంతత, ప్రేమ, ఆనందాన్ని అందజేయాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. క్రిస్మస్ ట్రీ వద్ద కొడుకు గౌతమ్, కూతురు సితార దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇక మెగా ఫ్యామిలీ అందరి తరపున నుంచి అల్లు శీరిష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కజిన్స్‌తో ఇలా సీక్రెట్ శాంటా ఆడినట్లు తెలిపారు. అటువంటి అద్భుతమైన ఆతిథ్యమిచ్చినందుకు చరణ్ & ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభువైన క్రీస్తు జీవితం, సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి బలాన్ని ఇచ్చాయని, న్యాయమైన, సమగ్ర సమాజాన్ని నిర్మించటానికి అతని మార్గం చూపిస్తుందన్నారు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. Merry Christmas from all of us! Played Secret Santa with cousins like every year. Thank you Charan & Upsi for being such amazing hosts. 🌲🎅🎄🎁 pic.twitter.com/6AqoUDbB20 — Allu Sirish (@AlluSirish) December 25, 2020 Merry Christmas to all of you! Spread some cheer... Let this be a beautiful day of giving and sharing. Wishing you all peace, love, and joy! ✨ pic.twitter.com/Z92nF6hC35 — Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2020 Wishing everyone a very #MerryChristmas🎄 — Jr NTR (@tarak9999) December 25, 2020 Merry Christmas! The life and principles of Lord Christ gives strength to millions across the world. May his path keep showing the way in building a just and inclusive society. May everybody be happy and healthy. — Narendra Modi (@narendramodi) December 25, 2020 -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. -
ప్రజలకు ఏపీ గవర్నర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధలను ఆదరించే సందర్భం. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది. ఈ సందర్భంగా నా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం ప్రార్థిస్తున్నాను. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది. సాంఘిక దూరాన్ని పాటించటం, మాస్కు ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని నివాసాలలో సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అని క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్ సందేశం ఇచ్చారు. చదవండి:మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్ ఘన నివాళి -
సీఎం జగన్, కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జన్మదినాన్ని ఆనందం తో జరుపుకోవాల్సిన సందర్భమిదని, జీసస్ బోధనల అనుసారం కరుణ, ప్రేమకు పునరంకితం కావాలని తన సందేశంలో పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణను ప్రబోధించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తన సందేశంలో తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాక్షి, అమరావతి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సాటి మను షుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, క్రైస్తవ సోదరులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు బోధనలు, సందేశాలు ఆచరణీయమైనవని, ప్రేమ, శాంతి సందేశాలు, ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఏసు సందేశాలను ఆచరించాలని, ఆయన ఆశయాలను పాటించడమే నిజమైన భక్తి అని చెప్పారు. -
సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, వైఎస్సార్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
ఏసు బోధనలకు పునరంకితం కావాలి: గవర్నర్ నరసింహన్
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రపంచానికి ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, జాలి, కరుణ, దయ గుణాలకు పునరంకితం కావాల్సిన సందర్భమిది. విశ్వాసం, సత్ప్రవర్తనతో మన జీవితాలను ముందుకు నడిపించడానికి ఏసు జీవితమే స్ఫూర్తిదాయకం. ఈ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరసోదరీమణులతో కలసి విశ్వశాంతి కోసం ప్రార్థిస్తున్నాను..’అని గవర్నర్ పేర్కొన్నారు. అందరికీ ఆదర్శం: సీఎం సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ఏసు బోధనలు సదా అనుసరణీయం. అవి మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలి..’అని సీఎం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హోంమంత్రి మహమూద్ అలీ మరో ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్ష లు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చేసుకుంటున్న ఈ పవిత్ర పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. లౌకిక పార్టీగా సర్వమతాలను ఆదరిస్తూ మత సామరస్యం పాటిం చే పార్టీ కాంగ్రెస్ అని అందులో పేర్కొన్నారు. -
ఎయిర్పోర్ట్ ఉద్యోగి క్రిస్మస్ విషెస్.. వైరల్
సిడ్నీ: ఏదైనా వినూత్నంగా చేస్తేనే గుర్తింపు లభిస్తోంది. ఇలానే వినూత్నంగా ఆలోచించి వార్తల్లో నిలిచింది ఓ ఎయిర్పోర్ట్ ఉద్యోగి. అసలే క్రిస్మస్ పండుగ.. విమానాశ్రయంలో ప్రయాణీకులు అందరూ తమ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇంతలో అక్కడి ఉద్యోగిని తన చక్కటి స్వరంతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ పాట పాడింది. దీంతో ప్రయాణీకులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ఓ విమానాశ్రయంలో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెకెర్ ఐల్యాండ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిచార్డ్ బ్రాన్సన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే 5.8 లక్షల మందికిపైగా వీడియోను చూడగా 67,000 మంది లైక్ కొట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఆనందకర వాతావరణాన్ని సృష్టించినందుకు నెటిజన్లు సిబ్బందిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ప్రేమను అన్ని చోట్ల వ్యాప్తింపజేయాలని కొందరు కోరారు. మరికొందరేమో ఆమె స్వరం బాగుందని మెచ్చుకున్నారు. ఎయిర్పోర్ట్ ఉద్యోగి క్రిస్మస్ విషెస్.. వైరల్ -
వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు.
-
క్రీస్తు జీవితం మానవాళికి మహోన్నత సందేశం
సాక్షి, హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సోదరులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని చెప్పారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
క్రీస్తు బోధనలకు పునరంకితం కావాలి
సాక్షి, హైదరాబాద్ : క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆనందంతో ఏసును గుర్తు చేసుకోవాల్సిన శుభసందర్భమిది. ప్రపంచానికి ఆయన ప్రబోధించిన ప్రేమ, జాలి, కరుణ, దయ గుణాలకు పునరంకితం కావాల్సిన సందర్భం కూడా. విశ్వాసం, సత్ప్రవర్తనతో మన జీవితాలను ముందుకు నడిపించడానికి క్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం. ఈ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరసోదరీమణులతో కలసి విశ్వశాంతి కోసం ప్రార్థిస్తున్నాను’’ అని గవర్నర్ తన సందేశంలో తెలిపారు. క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం: సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలు సదా అనుసరణీయం: చంద్రబాబు సాక్షి, అమరావతి: క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని, సమానత్వం, శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని, నిస్సహాయులపై కరుణ చూపాలని ప్రబోధించారని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు సదా అనుసరణీయమన్నారు. క్రిస్మస్ పండుగను సంతోషంగా నిర్వహించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చంద్రన్న కానుకను క్రైస్తవులు స్వీకరించాలని కోరారు. గుంటూరులో క్రైస్తవ భవన్ నిర్మాణానికి రెండెకరాల భూమిని కేటాయించామని, వచ్చే క్రిస్మస్ను క్రిస్టియన్ భవన్‌లోనే నిర్వహిస్తామని తెలిపారు. -
వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం ఇవన్నీ జీసస్ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత సందేశాలని జగన్ అన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
-
విశ్వాసానికి ఏసు జీవితం స్ఫూర్తిదాయకం
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్ క్రైస్తవ సోదరులకు, రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏసు క్రీస్తును సంతోషంతో స్మరించుకునే రోజే క్రిస్మస్ అని, ఈ మానవాళికి ఏసు నేర్పిన ప్రేమ, సహనం, ఓదార్పునకు మనమంతా పునరంకితం కావాల్సిన సమ యం ఇది’ అని గవర్నర్ తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. మానవాళిపై కరుణ ప్రసాదించాలని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సోదర సోదరీమణులతో కలసి ప్రార్థిస్తున్నానని అన్నారు. ‘ప్రేమ భావాన్ని, సేవాతత్ప రతను బోధించిన క్రీస్తు జన్మదినం యావత్ మానవ జాతికి సంతోషకరమైన రోజు’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం.. ఇవన్నీ మానవాళికి జీసస్ ఇచ్చిన సందేశమని ఆయన పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని తెలిపారు. క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
‘పొంగులేటి’ క్రిస్మస్ శుభాకాంక్షలు
-
‘పొంగులేటి’ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేద క్రైస్తవులను దళితులగా గుర్తించి వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేసిన జగన్