ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్‌ శుభాకాంక్షలు | President Murmu wishes fellow citizens on Christmas eve | Sakshi
Sakshi News home page

ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

Published Sun, Dec 25 2022 6:11 AM | Last Updated on Sun, Dec 25 2022 6:11 AM

President Murmu wishes fellow citizens on Christmas eve - Sakshi

న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ప్రేమ, దయతో మెలగాలని క్రిస్మస్‌ మనకు ప్రేరణనిస్తుందని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశ ప్రజలకు శనివారం ఆమె క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పర్వదినం మానవాళి శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని రాష్ట్రపతి ఆ సందేశంలో తెలిపారు.

‘యేసుక్రీస్తు అందించిన కరుణ, త్యాగం అనే సందేశాన్ని ఈ రోజున మనం స్మరించుకుందాం. క్రిస్మస్‌ పండుగ ఒకరినొకరు ప్రేమ, దయతో మెలగడానికి స్ఫూర్తినిస్తుంది. క్రీస్తు యొక్క దైవిక బోధనలను మన జీవితంలో స్వీకరిద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆమె పేర్కొన్నారు. ‘దేశ ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement