merry christmas
-
Christmas 2024 లోక రక్షకుడు
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...సర్వలోకానికి శాంతి సందేశం..దివిలోనూ భువిలోనూ వేడుక...పరలోక దూతావళి పరవశించి పాడిన వేళప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.రక్షణ తెచ్చిన క్రిస్మస్ యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది. క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు -
ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈసారి శివరాత్రి శుక్రవారం పడింది. దీంతో ఈసారి థియేటర్లలో 'గామి', 'భీమా' లాంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు 'ప్రేమలు' అనే డబ్బింగ్ బొమ్మ కూడా థియేటర్లలోకి వచ్చేసింది. ఇదే టైంలో ఓటీటీల్లోనూ పలు మూవీస్ రిలీజైపోయాయి. 'హనుమాన్' కూడా స్ట్రీమింగ్ అయిపోతుందన్నారు కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఓ రెండు హారర్, థ్రిల్లర్ మూవీస్ మాత్రం ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) సందీప్ కిషన్ హీరోగా నటించిన హారర్ సినిమా 'ఊరి పేరు భైరవకోన'. చాలా కాలం షూటింగ్ జరుపుకొని, వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ ఉన్నంతలో డీసెంట్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఇది కేవలం 21 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 అన్నారు కానీ ప్రైమ్‌లోకి వచ్చి చిన్న షాక్ ఇచ్చింది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'మేరీ క్రిస్మస్'. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిందీ-తమిళంలో మాత్రమే రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఇప్పుడు ఇదే భాషల్లో స్ట్రీమింగ్ అయిపోతోంది. మరోవైపు ఫిబ్రవరిలో రిలీజైన మలయాళ హిట్ బొమ్మ 'అన్వేషిప్పిన్ కండేతుమ్' అనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులోకి వచ్చేసింది. ఇది మాత్రం తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. శివరాత్రికి రిలీజైన వాటిలో ఈ మూడు మాత్రమే ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. టైమ్ ఉంటే వీటిపై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ మూవీ..
భాషాభేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్‌గా, హీరోయిన్ తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. రకరకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. పాత్ర నచ్చాలే కానీ ఏదైనా ఓకే అంటున్నాడు. ఈయన ఇటీవల హీరోగా నటించిన చిత్రం మెర్రీ క్రిస్మస్. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీలో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. టిప్స్ ఫిలింస్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ పలుమార్లు వాయిదా పడి చివరకు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నేడు అర్ధరాత్రి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ముందుగా హిందీ, తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. Vijay Sethupathy’s #MerryChristmas will be streaming from Mar 8 on NETFLIX. pic.twitter.com/t3iNs7obth — Christopher Kanagaraj (@Chrissuccess) March 6, 2024 చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు -
నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్లో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌ను మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్గా మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బద్లాపూర్ వంటి థ్రిల్లర్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌కు థ్రిల్లర్ జోనర్ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.దీంతో ఆయన మళ్లీ అదే జోనర్‌లోనే మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి 12న ఈ మూవీ రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన మెర్రీ క్రిస్మస్ కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. కానీ సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మెర్రి క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రానుందని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.30 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకుందట. దీంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్ కాకుంటే ఫిబ్రవరి 16న గ్యారెంటీగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని టాక్. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. -
Merry Christmas Movie Premiere: 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రీమియర్‌లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
Christmas 2023 Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘క్రిస్మస్ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి. ఇంతటి పర్వదినాన తోటి పౌరులు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు. -
ప్రత్యేక అతిథిగా...
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల వెండితెర క్రిస్మస్ వేడుకల్లో రాధికా ఆప్టే ప్రత్యేక అతిథిగా సందడి చేశారట. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం రాధికా ఆప్టేను ఎంపిక చేశారట. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. హిందీ, తమిళ భాషల్లో రూపొంది, తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘బదలాపూర్’, ‘అంథాధూన్’లో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరూ ప్రేమ, దయతో మెలగాలని క్రిస్మస్ మనకు ప్రేరణనిస్తుందని రాష్ట్రప తి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశ ప్రజలకు శనివారం ఆమె క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం మానవాళి శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని రాష్ట్రపతి ఆ సందేశంలో తెలిపారు. ‘యేసుక్రీస్తు అందించిన కరుణ, త్యాగం అనే సందేశాన్ని ఈ రోజున మనం స్మరించుకుందాం. క్రిస్మస్ పండుగ ఒకరినొకరు ప్రేమ, దయతో మెలగడానికి స్ఫూర్తినిస్తుంది. క్రీస్తు యొక్క దైవిక బోధనలను మన జీవితంలో స్వీకరిద్దామంటూ ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆమె పేర్కొన్నారు. ‘దేశ ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు’ అని తెలిపారు. -
Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్: ‘నీ రాజ్యం వచ్చును గాక...’
ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్ సీజన్’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్ గుడ్’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్ స్టార్’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్ గుడ్’ సీజన్ కావడం వల్లా? అంతే కావచ్చు... ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్’ భావన ‘క్రిస్మస్’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్ ‘ఫిక్షన్’ కాలేదు. యువకుడైన జీసస్‌ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు. జీసస్ వాళ్ళ చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్ మార్క్స్ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు. బాలుడైన జీసస్ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్’ గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్‌లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్ వద్దకు రావడం– ‘క్రిస్మస్’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు. ప్రపంచం ‘క్రిస్మస్’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్’ కట్ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్ మార్కెట్ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్ పోర్టుల్లో ‘క్రిస్మస్’ సందడి నెల ముందే మొదలయింది. – జాన్ సన్ చోరగుడి -
సెమీ క్రిస్మస్.. స్టూడెంట్స్ ర్యాంప్ వాక్
-
మెర్రి క్రిస్మస్
-
ఈ టాప్ హీరోయిన్ను గుర్తుపట్టారా?
హైదరాబాద్: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఈ నటిని గుర్తు పట్టారా?..అదేనండి అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అందాల భామ సమంత. తనకు ఉండాలనుకుంటున్న లక్షణాలు అన్ని సముద్రానికున్నాయని చెబుతోంది ఈ సుందరి. అవేంటంటే..అందం, అంతుచిక్కని రహస్యాలు, సువిశాలమైన తత్వం, స్వేచ్ఛ అంటోంది ఈ ముద్దు గుమ్మ. సముద్రంలో వెనకవైపు నుంచి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసి తన అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. 2017 జనవరి 29న నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. నిశ్చితార్థం తరువాత కాస్త గ్యాప్ తీసుకొని అఖిల్ పెళ్లి తరహాలోనే నాగచైతన్య, సమంతల వివాహాన్ని డెస్టినేషన్ వెడ్డింగ్లా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పనుల్లో బిజీగా ఉండగా సమంత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకటి రెండు తమిళ సినిమాలు అంగీకరించిందన్న టాక్ వినిపించినా.. షూటింగ్ లకు మాత్రం వెళ్లటం లేదు. -
మెర్రీ కేక్స్
‘మెర్రీ’ అంటే సంతోషం. ఇది సంతోషాన్నిచ్చే పండుగ. అవును... ఇచ్చే పండుగ! ప్రేమను కానుకల్లా... ప్యాకేజ్ చేసి ఇచ్చే ప్రేమ ఎలా ఉంటుంది?! మృదువుగా... అందంగా... తియ్యగా... కేకులా ఉంటుంది. క్రిస్మస్ కేక్స్... మీ కోసం! ‘మెర్రీ క్రిస్మస్’ కోసం!! క్రిస్మస్ కేక్ కావాల్సినవి: స్పాంజ్ కేక్, ప్లమ్ కేక్‌ని ఈ కింద చెప్పిన విధంగా అలంకరిస్తే క్రిస్మస్ కేక్ సిద్ధం... ప్లమ్ కేక్/ స్పాంజ్ కేక్ – 1 (కేజీ), గుడ్డులోని తెల్లసొన – 100 ఎం.ఎల్, ఐసింగ్ షుగర్ (పంచదార పొడి) – 300 గ్రాములు, నిమ్మకాయ – 1 (రసం తీయాలి) ఆప్రికాట్ జామ్ – 20 గ్రాములు, మార్జిపాన్ క్రీమ్ – తగినంత అలంకరణకు: శాంటాక్లాజ్ – 1, క్రిస్మస్ ట్రీ – 1 (చిన్నది), శాటిన్ రిబ్బన్ – 1, స్టార్– 1 తయారీ: ప్లమ్కేక్కి పైన, చుట్టుపక్కల ఆప్రికాట్ జామ్ పూయాలి. మార్జిపాన్‌తో ప్లమ్కేక్ను అంతా కవర్ చేయాలి. గుడ్డులోని తెల్లసొనను గరిటతో నురగ వచ్చేదాకా గిలకొట్టాలి. దీంట్లో పంచదార పొడి, నిమ్మరసం కలపాలి. దీనిని ‘రాయల్ ఐసింగ్’ అంటారు. దీనిని ప్లమ్ కేక్ మీద లేయర్‌లాగా పూయాలి. చివరగా శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ, శాటిన్ రిబ్బన్, స్టార్లతో అలంకరిస్తే క్రిస్మస్ కేక్ సిద్ధం. క్యారెట్ కేక్ కావాల్సినవి: మైదా – 2 కప్పులు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ను (500 మి.లీ), వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్) – అర కప్పు, పాలు – అర కప్పు తయారీ: మైదా, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి. వెన్న, పంచదారపొడి, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా మిశ్రమం, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే... కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదంటే చేతితో టిన్ను లోపల అంతా సర్దాలి. అవెన్ని 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసి, అర గంటపాటు బేక్ చేసి తీయాలి. తర్వాత లేయర్స్‌గా కట్ చేయాలి. లేయర్ల మధ్యలో వైట్ బటర్ని పెట్టి, ఆ పైన కట్ చేసిన క్యారెట్ కేక్‌ను అమర్చాలి. పైన వైట్ బటర్తోనూ, కలర్ క్రీమ్‌తోనూ అలంకరించాలి. పైనాపిల్కేక్ కావాల్సినవి: గుడ్లు – 4, మైదా – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, వంటసోడా – పావు టీ స్పూన్, వెన్న – 200 గ్రాములు, పంచదార – 200 గ్రాములు, పైనాపిల్ ఎసెన్స్ – 6 చుక్కలు, పైనాపిల్ ముక్కలు – 8, చెర్రీలు – 8 తయారీ: కేక్ చేసే టిన్నులో మూడు చెంచాల పంచదార వేసి, వేడి చేయాలి. అది కరిగి ఎర్రగా అవుతుంది. ఆ పాకాన్ని గిన్నెకి అంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండు మూడు సార్లు చల్లించాలి. పైనాపిల్ చెక్కు తీసి సన్నని, గుండ్రటి స్లైసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి. ఇందులో కోడిగుడ్లు పచ్చసొన వేసి కలపాలి. తెల్లసొనను విడిగా నురుగ వచ్చేలా గిలకొట్టాలి. ఈ వెన్న మిశ్రమంలో గుడ్ల మిశ్రమం, మైదాపిండిని ఒకదాని తరువాత ఒకటి వేసి కలుపుతుండాలి. చివరలో ఎసెన్స్ వేయాలి. క్యారమిల్ సిరప్ రాసిన కేక్ టిన్నులో పైనాపిల్ ముక్కలు దగ్గర దగ్గరగా అమర్చాలి. వీటి మధ్యభాగంలో చిన్న ముక్క తీసేసి అక్కడ చెర్రీపళ్లు పెట్టాలి. కలిపి సిద్ధంగా ఉంచిన కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరవాలి. ముందే వేడి చేసుకున్న 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర 50 నిముషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తరువాత టిన్నును ఒక పళ్లెంపై పెట్టి తిరగేసి, కేక్‌ను బయటకు తీస్తే పైనాపిల్ ముక్కలు పైకి కనపడుతూ కేక్ తయారవుతుంది. అడుగున పెట్టిన పళ్ల ముక్కలు పైకి వస్తాయన్నమాట. తర్వాత వైట్ బటర్, పైనాపిల్, చెర్రీ, చాకో స్టిక్స్‌తో అలంకరించుకోవాలి. ఎగ్‌లెస్ కేక్ కావాల్సినవి: మిల్క్‌మెయిడ్ – 400 గ్రాములు, పాలు – 300 మి.లీ, వైట్ బటర్ – 180 గ్రాములు, పంచదార – 15 గ్రాములు, మైదా – 250 గ్రాములు, వంట సోడా– చిటికెడు, బేకింగ్ పౌడర్– టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – 10 మి.లీ. తయారీ: మైదా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి. అవెన్ని 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసి, ఈ మిశ్రమం ఉన్న కేక్పాత్రను అవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. వాల్నట్కేక్ కావాల్సినవి: మైదా – పావుకేజీ, గుడ్లు – 6, పంచదార పొడి – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, వైట్ బటర్ – పావుకేజీ, వాల్నట్స్– 25 గ్రాములు (పలుకులుగా చేయాలి) తయారీ: ఒక పెద్ద గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, వంట సోడా వేసి జల్లించాలి. దీంట్లో బాగా గిలకొట్టిన గుడ్లసొన వేసి కలపాలి. తర్వాత పంచదార, బటర్, వాల్నట్ పలుకులు బాగా కలిపి, పక్కన ఉంచుకోవాలి. బేకింగ్ గిన్నె అడుగున కొద్దిగా బటర్ రాసి, ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అందులో వేసి, సమానంగా చేయాలి. అవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 30–40 నిమిషాలు బేక్ చేసి, తీయాలి. పొడి చేసిన పంచదార పైన చల్లి, బటర్ రాసి, వాల్‌నట్స్‌తో అలంకరించాలి. -
SMS : పైలాపచ్చీస్
వోడాఫోన్లో పనిచేసే ఇంజనీర్ నీల్ పాప్‌వర్త్ 1992 డిసెంబర్ 3న ‘మెర్రీ క్రిస్మస్’ అంటూ తొలి ఎస్ఎంఎస్ను తన కొలీగ్‌కు పంపాడు. తొలి ఎస్ఎంఎస్ విజయవంతం కావడానికి దాదాపు దశాబ్దం ముందు నుంచే ఇలాంటి సేవలను అందుబాటులోకి తెచ్చే పరిశోధనలు, ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. జర్మన్ ఇంజనీర్ ఫ్రీడ్హెల్మ్ హీల్బ్రాండ్, ఫ్రెంచి ఇంజనీర్ బెర్నార్డ్ గిల్లెబార్ట్ 1984లోనే ఎస్ఎంఎస్ సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రమాణాలకు రూపకల్పన చేశారు. కొత్త సహస్రాబ్ది ప్రారంభమయ్యే నాటికి మొబైల్ ఫోన్లు మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఏడాది ఏడాదికీ మొబైల్ ఫోన్ల మోడళ్లలో రకరకాల మార్పులు వచ్చాయి. వాటికి కెమెరాలు, వాయిస్ రికార్డింగ్ హంగులు వచ్చి చేరాయి. ఇవెన్ని వచ్చినా ఎస్ఎంఎస్ల జోరు ఆగలేదు సరికదా మరింత పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ఎస్ఎంఎస్లు ఫోన్లు మారుతున్నాయి. ఎస్ఎంఎస్ల వినియోగంలో కుర్రకారుదే జోరెక్కువని అంతర్జాతీయ గణాంకాలు చెవి‘సెల్లు’ కట్టుకుని మరీ చెబుతున్నాయి. సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మనుషులు ఒకరినొకరు కలుసుకోవడం తగ్గింది. మాటా మంతీ అంతా సెల్లోనే అనే పద్ధతి మొదలైంది. ఎస్ఎంఎస్ల వాడుక పెరగడంతో పాటు స్మార్ట్ఫోన్లలో రకరకాల యాప్‌ల ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లు పంపే వెసులుబాటు అందుబాటులోకి రావడంతో సంక్షిప్త సందేశాలదే రాజ్యంగా మారింది. దశాబ్దం కిందట సెల్ఫోన్లలో సంభాషణల సగటు నిడివి 3.5 నిమిషాలు ఉండేది. టెక్స్ట్ మెసేజ్‌ల జోరు పెరగడంతో సంభాషణల సగటు నిడివి 2. 2 నిమిషాలకు పరిమితమైందని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఎస్ఎంఎస్లు మనుషుల మధ్య మాటా మంతిని బొత్తిగా కరువు చేసేస్తున్నాయని, మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయని వాపోతున్న వారు లేకపోలేదు. అయితే, టెక్స్ట్ మెసేజ్‌ల దూకుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. క్రిస్మస్ శుభాకాంక్షలతో తొలి ఎస్ఎంఎస్ -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కేసిఆర్
-
ప్రేమలోకం
-
క్రిస్మస్ వేడుకలలో మంత్రి ఈటెల
-
మెదక్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు
-
సీఎం కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. తోటి వారికి తోడ్పడటం, ఇతరులకు సేవ చేయడంలోనే మానవ జన్మ పరమార్థం దాగి ఉందని క్రీస్తు బోధించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పరమత సహనం, మత సామరస్యం పునాదులుగా తెలంగాణ రాష్ట్రం భాసిల్లుతోందని, ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రజలను కోరారు. -
మెర్రీ క్రిస్మస్
నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జననం కోసం భక్తులు కనులారా వేచి చూశారు. క్రిస్మస్ పర్వదినం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్ధనలు... లోకరక్షకుడి జననం కోసం మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అన్ని చర్చిల్లో ప్రత్యేక స్తుతిగీతాలను ఆలపించారు. సంఘస్తులు, యువత క్రీస్తు జనన సందేశాన్ని అందించేందుకు పురవీధుల్లో క్యారల్స్గా తిరిగారు. క్యారల్స్‌లో ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. శాంతాక్లాజ్ (క్రిస్మస్తాత) నృత్యాలు చిన్నారులను అలరించాయి. చర్చిల్లో అర్ధరాత్రి కేకులు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు, మహిళలు క్రీస్తు జననాన్ని తెలిపే డ్రామాలు ప్రదర్శించారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న రోమన్ కేథలిక్, కెథడ్రిల్ చర్చిలో బిషప్ మోస్ట్ రెవరెండ్ ప్రకాశం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాదిగా భక్తలు పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్లో బాప్టిస్టుచర్చి డౌనీ హాల్లో రెవరెండ్ జి.పీటర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవ్, యూత్ డెరైక్టర్ జానిజో ఆధ్వర్యంలో యువజన క్రిస్మస్ వేడుకలు జరిగాయి. లోన్‌స్టార్ బాప్టిస్టు చర్చిలో రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్, రెవరెండ్ విజయ్‌కుమార్, రెవరెండ్ థామస్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఫతేఖాన్‌పేట లూథరన్ చర్చిలో రెవరెండ్ ఏసుప్రతాప్, వ్యవస్థాపకులు జీఆర్ సుధాకర్ పర్యవేక్షణలో ప్రార్థనలు చేశారు. భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో.. నగరంలోని డౌనీహాల్లో క్రిస్మస్ వేడుకలను భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జనయించిన వేళ కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు జరుపుతున్నామన్నారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు భక్తులందరికీ కేక్‌లు పంపిణీ చేశారు. బ్రదర్ విలియమ్స్ శుభకర్ వాఖ్యోపదేశం చే శారు. రోమేల్రాయ్, సునీల్, నిరంజన్ బృందాలు భక్తిశ్రద్ధలతో గీతాలను ఆలపించారు. సంఘ కాపరి పీటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతీ సిమెంట్స్ సేల్స్ ఆఫీసర్ సుబ్బరాజు పాల్గొన్నారు. కందిపప్పుపై క్రిస్మస్ స్టార్ వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్: స్థానిక కాశీపేటకు చెందిన మొద్దు వెంకటాచలం కందిపప్పుపై చెక్కిన క్రిస్మిస్ స్టార్ ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సందర్భంగా ఆయన పెన్సిల్‌పై చెక్కిన హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ ట్రీ, శిలువ అబ్బురపరిచాయి. కళాతృష్ణ ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని వెంకటాచలం మంగళవారం ‘న్యూస్‌లైన్’తో అన్నారు. తల్లిదండ్రులు పెంచలమ్మ, రమణయ్య ప్రోత్సాహంతో కళారంగాల్లో రాణిస్తున్నట్టు అతను చెప్పారు. నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని అవిష్కరించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. నగరంలోని ఏసీ నగర్‌కు చెందిన పిల్లా చంద్రశేఖర్, తమ్మిశెట్టిరవి, గుండుపోగు రవి, కళాకారులు ఈ సైకత శిల్పాన్ని కోడూరు బీచ్‌లో రూపొందించారు. క్రిస్మస్ తాత (శాంతాక్లాజ్) ఆకారాన్ని ఇసుకతో అందంగా తీర్చిదిద్దారు. నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన సీయోన్గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం పాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన కోడూరు బీచ్‌లో క్రిస్మస్ వాతావరణాన్ని నెలకొల్పింది.